దాసరికి తీరని కోరకలు

Unfulfilled desires of Dasari Narayana Rao

Unfulfilled desires of Dasari Narayana Rao

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎవరూ అందుకోలేని శిఖ‌రాల‌ను అధిరోహించిన దాస‌రి నారాయ‌ణ‌రావు ఒక తీర‌ని కోరిక‌తో క‌న్నుమూశారు. ఆయ‌న సినీ జీవితంలో 151 సినిమాలు డైరెక్ట్ చేశారు. ఆయ‌న స్పృషించ‌ని క‌థ‌లేదు, ఆయ‌న క్రియేట్ చేయ‌ని క్యారెక్ట‌ర్ లేదు. ఎంద‌రో దర్శ‌కుల‌కు ర‌చ‌యిత‌ల‌కు ఆయ‌న మార్గ‌ద‌ర్శ‌కం. దాస‌రి చేసిన ప్ర‌యోగాలు ఇప్ప‌టికి నేటి త‌రం డైరెక్ట‌ర్లు రీచ్ అవ‌లేక‌పోతున్నారంటే వేరే చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అలాంటి మ‌హోన్న‌త మైన ద‌ర్శ‌కుడు తాను ఇష్ట‌ప‌డ్డ రెండు కోరికలను మాత్రం తీర్చుకోకుండానే అభిమానుల‌ను వీడి వెళ్ళాడు.

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్  దర్శకరత్న దాసరి నారాయణరావుల కాంబినేషన్ లో సినిమా రావాలనే కోరిక అభిమానులకు తీరలేదు. అది అభిమానుల కోరిక మాత్ర‌మే కాదు దాస‌రి కోరిక కూడా. ప‌వ‌న్ క‌ళ్యాన్ మీద ఇష్టంతో ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం అది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకరత్న దాసరి నారాయణరావుల కాంబినేషన్ లో సినిమా తీయాలని నిర్ణయించారు. ఆ విష‌యాన్ని వీరిద్దరూ స్వయంగానే ప్రకటించారు. అయితే ఈ కాంబినేషన్ కు తగ్గ కథ కోసం చాలారోజులుగా ఎదురుచూస్తున్నారు. కథ కోసం చాలారోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల పవన్ పుట్టినరోజు సందర్భంగా తమ తారకప్రభు ఫిలింస్ బ్యానర్ లో 38వ, సినిమాగా పవన్ తో సినిమాను నిర్మిస్తున్నట్టుగా దాసరి యాడ్ కూడ ఇచ్చారు.

దాస‌రికి ప‌వ‌న్ తో సినిమాచేయాల‌నే కోరిక‌తోపాటు అదే మహాభారతం చిత్రం. ఆయన మహా భారతాన్ని చిత్రంగా మలచాలని కలలు కన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమాను రూపొందించాలనుకున్నారు. అదే తన ఆఖరి చిత్రం అవుతుందని కూడా దాసరి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సినీరంగం నుంచి ఓ మంచి సక్సస్ తో రిటైర్ అవ్వాలనుకున్నారు. కానీ అది నెరవేరకుండానే సినీపరిశ్రమను దుఖసాగరంలో ముంచి వెళ్లిపోయారు దాసరి.

దాదాపు 151 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డు కూడా సాధించాడు. దాదాపు 50కి పైగా సొంతంగా సినిమాలు నిర్మించాడు. బుల్లితెర సీరియళ్ల నిర్మాణ రంగంలోనూ అడుగు పెట్టి విజయం సాధించిన వాడు. మరి ఇన్ని సాధించిన దాసరికి ఈ రెండు కోరిక‌లు తీర‌క‌పోవ‌డ విషాదం. అయితే దాస‌రి ప‌వ‌న్ కాంబినేష‌న్ సినిమా మాత్రం ఆయ‌న కుమారులు దాస‌రి బ్యాన‌ర్ లో రూపొందించే అవ‌కాశం వుంద‌ని అంటున్నారు మరి త‌రువాతి ప‌రిణామాలు ఎలా వుంటాయో చూడాలి మ‌రి.

-శ్రీకాంత్ కొణపర్తి

Have something to add? Share it in the comments

Your email address will not be published.