అవివాహితులకు అగ్రతాంబూలం

దశాబ్దాలుగా సంసార బాధ్యతలు లేని నరేంద్రమోడీ మన దేశ ప్రధాని. ఇక అవివాహితులైన రావత్ ఉత్తరాఖండ్ కు, ఖత్తర్ హర్యానాకు, సోనోవాల్ అస్సాంకు, నవీన్ పట్నాయిక్ ఒడిషాకు, మమతాబెనర్జీ బెంగాల్ కు ముఖ్యమంత్రులుగా వున్నారు. ఇప్పుడు అవివాహితుడైన యోగి ఆదిత్యనాధ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపిక అయ్యారు. అవివాహితులను నిస్వార్ధపరులుగా, అంకిత భావంతో పనిచేసేవారిగా మన ప్రజలు ఇంకా భావిస్తున్నారు. జీవితం పట్ల సమగ్ర అవగాహన లేనివారిగా వీరిని ప్రజలు ఇంకా అనుమానించడం లేదు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.