చీపురు పట్టిన ముఖ్యమంత్రి

up-cm-yogi-adityanath-picks-up-broom-after-up-cities-ranked-last-in-swachh-survey-2017

up-cm-yogi-adityanath-picks-up-broom-after-up-cities-ranked-last-in-swachh-survey-2017

స్వచ్ఛ సర్వేక్షణ సర్వేలో వచ్చిన ఫలితాలు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో చీపురు పట్టేలా తయారుచేశాయి. ఈమధ్య కేంద్రప్రభుత్వం విడుదల చేసిన సర్వేలో పరిశుభ్రతలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అట్టడుగు స్థానంలో ఉండటంతో పాటు ఒక్క వారణాశి మినహా దాదాపు 50 పట్టణాలు 300 కంటే కింది స్థానాలు దక్కించుకున్నాయి. వారణాశి 32వ ర్యాంకులో నిలిచింది. దీంతో విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న యూపీ సీఎం ఆదిత్యనాథ్‌.. స్వచ్ఛ యూపీకి శ్రీకారం చుట్టారు.

అందులోభాగంగా ఈరోజు ఉదయం చీపురు చేతబట్టి లఖ్‌నవూలోని బాలు అడ్డా కాలనీలో రోడ్డు ఊడ్చారు యోగి ఆదిత్యనాథ్. ఆయనతో పాటు సీనియర్‌ కేబినెట్‌ మంత్రి సురేశ్‌ కన్నా, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయితే సీఎం యోగి ఆదిత్యనాథ్ సంకల్పానికి పలువురు మద్దతివ్వగా.. మున్సిపల్‌ సిబ్బంది మాత్రం భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. ‘సీఎం ఒక్కరోజు రోడ్లూడ్చి వెళ్లిపోతారు. ఆ తర్వాత ప్రజలు మర్చిపోతారు. ప్రతిరోజూ మేం వీధులు శుభ్రం చేస్తాం. కానీ కొన్ని క్షణాలకే ప్రజలు చెత్తాచేదారం, ఉమ్మి వేయడం చేస్తుంటారు. ఇక స్వచ్ఛభారత్‌ ఎలా సాధ్యమవుతుంది. ముందు ప్రజల ఆలోచనా విధానం మారాలి. పరిశుభ్రతపై వారికి అవగాహన కల్పించాలి’ అని మున్సిపల్‌ సిబ్బంది చెబుతున్నారు

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.