ఉత్తరప్రదేశ్ లో విజయం దిశగా బీజేపీ

up election result 2017

up election result 2017

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ లో భారతీయ జనతా పార్టీ విజయం దిశగా పయనిస్తోంది. శనివారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో  బీజేపీ అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది.

ఉత్తర ప్రదేశ్ లో మొత్తం 403 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బీజేపీ 310 చోట్ల ఆధిక్యంలో ఉంది. అధికార సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమి 64, బీఎస్పీ 22 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఎన్నికల లెక్కింపు సరళి ఇలాగే కొనసాగితే బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించే అవకాశముంది. సమాజ్ వాది పార్టీ, కాంగ్రెస్ కంచుకోటల్లోనూ కమలం వికసిస్తోంది. సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు సైతం వెనుకంజలో ఉన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.