గాంధీ మనవడినే రంగంలో దింపారు

UPA alliance selects Gopal krishna Gandhi for Vice Presidential candidate

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో అధికారపక్షం రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రకటించిన తర్వాత విపక్షాలు మీరాకుమార్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించి బరిలో ఉన్నా గెలుపు మాత్రం కోవింద్ వైపే ఉండడంతో ఈసారి విపక్షాలు ముందు జాగ్రత్త చర్యలను మొదలుపెట్టింది. అందులోభాగంగా మహాత్మ గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీని యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు.

UPA alliance selects Gopal krishna Gandhi for Vice Presidential candidate

కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నాయకత్వంలో జరిగిన సమావేశంలో 18 విపక్ష పార్టీలు గోపాలకృష్ణగాంధీని అభ్యర్థిగా ఎంపికచేస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి. తమ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉండాలని గోపాలకృష్ణ గాంధీని కలిసి ప్రతిపక్ష పార్టీలు కోరనున్నాయి. గోపాలకృష్ణ గాంధీని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలపాలని బీహార్ సీఎం నితీశ్‌ కుమార్ ఆకాంక్షించారు. అయితే విపక్ష పార్టీల కూటమి మీరా కుమార్‌ను పోటీకి పెట్టడంతో ఆయన ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు ప్రకటించారు. ఈ నిర్ణయంతో జేడీ(యూ) నేత బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ ఏకీభవిస్తాయని కాంగ్రెస్‌, ఆర్జేడీ పార్టీలు ఆశాభావంతో ఉన్నాయి.

See Also: టార్గెట్ 2019: కెటిఆర్ ఏం చేయబోతున్నారో తెలుసా??

ఐఏఎస్‌గా పదవీ విరమణ చేసిన గోపాలకృష్ణ గాంధీ పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా సేవలందించారు. దక్షిణాఫ్రికా, శ్రీలంకలో భారత హైకమిషనర్‌గా..నార్వే, ఐలాండ్‌లో భారత రాయబారిగా పనిచేశారు. 1946, ఏప్రిల్‌ 22న జన్మించిన ఆయన ఢిల్లీ యూనివర్సిటీలోని సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీలో ఎంఎ ఇంగ్లీషు చదువుకున్నారు. 1968లో ఐఏఎస్‌ అధికారిగా చేరారు. 2004, డిసెంబర్‌లో పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2009 వరకు గవర్నర్‌గా పనిచేశారు. అయితే గోపాలకృష్ణ గాంధీ అభ్యర్థిత్వంపై నితీశ్‌ కుమార్‌ ఎలా స్పందిస్తారో చూడాలి. ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేయాల్సివుంది.

See Also: కశ్మీర్‌పై కన్నేసిన చైనా

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ గోపాలకృష్ణ గాంధీకి గతంలోనే పూర్తి మద్దతునిచ్చారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయనను నిలబెట్టాలనే ప్రతిపాదనను కూడా మమతే తీసుకొచ్చారు. కానీ చివరికి మాత్రం లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ను ఎంపిక చేశారు. ఆగస్టు 5న ఉపరాష్ట్రపతి ఎన్నికలుజరగనున్నాయి. అదేరోజు ఫలితాల లెక్కింపు చేపట్టనున్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ పదవీ కాలం ఆగస్టు 19తో ముగియనుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.