శశికళ హత్య: అంత్యక్రియలకు హనుమంతరావుకి అనుమతి

Us allows sasikalas husband hanumantha rao to attend funeral

Us allows sasikalas husband hanumantha rao to attend funeral

న్యూయార్క్ : న్యూజెర్సీలోని బర్లింగ్టన్‌లో హత్యకు గురైన తెలుగు టెకీ నర్రా శశికళ (36), కుమారుడు అనీష్‌ సాయి (7) ల అంత్యక్రియలకు హాజరయ్యేందుకు భారత దేశానికి రావడానికి శశికళ భర్త నర్రా హనుమంతరావుకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శశికళ , అనీష్ రక్తపు మడుగులో పడి ఉండగా ఈ హత్యలపై హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

అమెరికాలో హనుమంతరావు మీద ఎలాంటి కేసు నమోదు కాకపోవడంతో, అతడి ప్రయాణాలను నియంత్రించడం లేదని, శశికళ, అనీష్ సాయి అంత్యక్రియలకు వెళ్లేందుకు ఆయనకు అనుమతి లభించిందని బర్లింగ్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ అధికార ప్రతినిధి జోయెల్ బెవ్లీ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.