సెన్సార్ పూర్తి చేసుకున్న `ర‌క్ష‌క‌భ‌టుడు`

Vamsi Krishna Akella Rakshaka Bhatudu completes Censor works
Vamsi Krishna Akella Rakshaka Bhatudu completes Censor works

సుఖీభవ మూవీస్‌ పతాకంపై ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఎ. గురురాజ్‌ నిర్మాత‌గా రూపొందుతోన్న ఫాంట‌సీ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ `ర‌క్ష‌క‌భటుడు`. రిచాపనై, బ్ర‌హ్మానందం, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ, సుప్రీత్‌(కాట్రాజు). అదుర్స్ ర‌ఘు, ధ‌న‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో న‌టించారు.  ర‌క్ష‌, జ‌క్క‌న వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల త‌ర్వాత వంశీకృష్ణ ఆకెళ్ళ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని మే ప్ర‌థమార్థంలో విడుద‌ల‌కు సిద్ద‌మైంది. 

చిత్ర నిర్మాత ఎ.గురురాజ్ మాట్లాడుతూ `ర‌క్ష‌క‌భటుడు సినిమా మోష‌న్ పోస్ట‌ర్ నుండి సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. అస‌లు ఆంజ‌నేయ స్వామి గెట‌ప్‌లో న‌టించిన హీరో ఎవ‌ర‌ని అంద‌రూ అడుగుతున్నారు. అలాగే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇటీవ‌ల శేఖ‌ర్ చంద్రగారు సంగీత సార‌థ్యంలో విడుద‌లైన సాంగ్‌కు కూడా మంచి స్పంద‌న వ‌చ్చింది.
అర‌కులోయ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా పోలీస్ స్టేష‌న్‌లో ఏం జ‌రిగింది.  అస‌లు ఆంజ‌నేయ‌స్వామికి, ర‌క్ష‌క‌భ‌టుడు అనే టైటిల్‌కు ఉన్న రిలేష‌న్ ఏంటి? అనేదాన్ని ఆస‌క్తిక‌రంగా రూపొందించాం. ఎమోష‌న్స్‌, కామెడి, థ్రిల్లింగ్, స‌స్పెన్స్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి. ఫ‌స్ట్ సీన్ నుండి క్లైమాక్స్ వ‌ర‌కు సినిమా ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగుతుంది. చివ‌రి ప‌దిహేను నిమిషాలు హృద్యయంగా తెర‌కెక్కించాం.
సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని `యు/ఎ` స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమాను మే ప్ర‌థ‌మార్థంలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్‌, మ‌ల్హ‌ర్‌భ‌ట్ జోషి సినిమాటోగ్ర‌ఫీ, డ్రాగ‌న్ ప్ర‌కాష్ యాక్ష‌న్, బ్ర‌హ్మానందం హిలేరియ‌స్ కామెడి, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల ప‌నితీరు ఆడియెన్స్ ఎంగేజ్ చేస్తుంది“ అన్నారు.

రిచాపనై, బ్రహ్మానందం, బాహుబలి ప్రభాకర్‌, బ్రహ్మాజీ, సుప్రీత్‌ (కాట్రాజు), అదుర్స్‌ రఘు, ధనరాజ్‌, నందు, చిత్రం శ్రీను, సత్తెన్న, జ్యోతి, క ష్ణేశ్వర్‌రావు, మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: మల్హర్‌ భట్‌ జోషి, ఆర్ట్‌: రాజీవ్‌నాయర్‌, ఎడిటింగ్‌: అమర్‌ రెడ్డి, ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాష్‌, నిర్మాణ, నిర్వహణ: జె. శ్రీనివాసరాజు, ప్రొడ్యూసర్‌: ఎ.గురురాజ్‌, రచన, దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల.

Have something to add? Share it in the comments

Your email address will not be published.