ప్రకాశం బ్యారేజ్‌పై రాకపోకలు బంద్

Vehicles and pedestrians were banned on Prakasam Barrage till May 24th
Vehicles and pedestrians were banned on Prakasam Barrage till May 24th
విజయవాడలో కొత్త ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి.  ప్రకాశం బ్యారేజి అండర్‌ స్వ్కవర్‌ గేట్ల మరమ్మత్తుల నేపథ్యంలో బ్యారేజ్‌పై వాహన రాకపోకలు నిలిపివేశారు. బ్యారేజీకి ఇరువైపులా ఉన్న 14 పాతగేట్ల స్థానంలో కొత్త గేట్లు అమర్చుతున్నందున జలవనుల శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 24వ తేదీ వరకు ఈ మరమ్మతులు జరుగుతాయని తెలిపారు.
రాజధానిలోని వెలగపూడి సచివాలయానికి వెళ్లడానికి ట్రాఫిక్‌ మళ్ళింపు చర్యలు చేపట్టారు పోలీసులు. విజయవాడవైపు నుండి వీఐపీలు, ఉన్నతాధికారులు కనకదుర్గమ్మ వారధిపై నుంచి రావాల్సి ఉంటుందని పోలీసులు సూచించారు. వారధి దాటిన తరువాత పాత టోల్‌గేట్‌ వద్ద నుంచి తాడేపల్లి క్రిస్టియన్‌పేట మీదుగా ఎన్టీఆర్‌ కరకట్ట, బోటు యార్డు, ఉండవల్లి కూడలి మీదుగా వెలగపూడి సచివాలయానికి చేరుకోవలని చెప్పారు.
బ్యారేజీపై రాకపోకలు నిలిపివేసిన నేపథ్యంలో సచివాలయానికి చేరుకునే మ్యాప్‌ను అధికారులు విడుదల చేశారు. వాహనదారులు సహకరించాలని కోరారు అధికారులు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.