బోనమెత్తిన వెంకయ్య

Venkaiah Naidu participated in Bonalu event in Telangana Bhavan Delhi

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మహంకాళి బోనాల వేడుక కన్నుల పండుగగా జరిగింది. బోనాల వేడుకలో పాల్గొన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు  మహంకాళి అమ్మవారికి కేంద్రం తరపున పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం బోనమెత్తి మొక్కులు తీర్చుకున్నారు.

Venkaiah Naidu participated in Bonalu event in Telangana Bhavan Delhi

వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. భావితరాలకు సంప్రదాయ పండుగలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు, ఆలయ కమిటీ నిర్వాహకులకు వెంకయ్య అభినందనలు తెలిపారు. గత మూడేళ్లుగా ఢిల్లీలో బోనాల పండుగ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.