ఏపీ, తెలంగాణాలో సీట్ల పెంపు ఖాయం: వెంకయ్యనాయుడు

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాసనసభలలో సీట్ల సంఖ్య పెరుగుదల ఉండబోదని హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ మంగళవారం నాడు పార్లమెంటులో చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు.

టిఆర్ఎస్ ఎంపి కొత్తా ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు డిప్యూటీ హోంమంత్రి హన్స్ రాజ్ ఇచ్చిన సమాధానాన్ని కొన్ని టీవీ ఛానల్స్ ఉటంకించాయి.  తెలుగు రాష్ట్రాల్లో శాసనసభలో సీట్ల సంఖ్య పెంపు కుదరదని కొన్ని టీవీ ఛానల్స్ లో ప్రసారమైన వార్తను వెంకయ్యనాయుడు ఖండించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగాలంటే 171 (3) అధికరణను ను సంవరించవలసిన అవసరం ఉందని, అది ఇప్పటికిప్పుడే చేయడానికి వీలుపడదనీ హన్స్ రాజ్ చెప్పారని వెంకయ్యనాయుడు వివరించారు.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ శాసనసభల అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుదల గురించి ఇరు రాష్ట్రాల మంత్రిమండలి ఆమోదిస్తే దానికి అవసరమైన సవరణకు సూచనలు మాత్రమే హోం శాఖ చేస్తుందని తెలిపారు.

2014 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల పునర్నిర్మాణం ఉంటుందని నాయుడు పేర్కొన్నారు. అదే విధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీల్లో సీట్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దీనిని అవకాశంగా తీసుకొని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కే చంద్రశేఖర్ రావులు ఇతర పార్టీల్లోని ఎమ్మెల్యేను ఫిరాయింపులకు ప్రోత్సహించారు.

వెంకయ్యనాయుడు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఫోన్ లో మాట్లాడారు. అ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ హోం శాఖలో ఒక బిల్లు తయారవుతున్నదని దాని ద్వారా పార్లమెంటులో రాజ్యాంగ సవరణచేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచడానికి అవసరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని వెంకయ్యనాయుడు స్సష్టం చెశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.