మొద‌టి వీకెండ్‌లో ’92 ల‌క్ష‌లు’ వ‌సూలుచేసిన‌  ‘వెంకటాపురం’ 

Venkatapuram Movie success continues after the release
Venkatapuram Movie success continues after the release
గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం ఈ నెల 12న గ్రాండ్ గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడ‌ద‌ల‌య్యి మంచి చిత్రంగా ప్ర‌శంశ‌లు పొందుతుంది.  హ్యాపీడేస్ ఫేం యంగ్ హీరో రాహుల్, మహిమా మక్వాన్ జంటగా నటించారు. స్వామిరారా, రౌడీఫెలో చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మెద‌టి వీకెండ్ కంప్లీట్ చేసుకుని 92 ల‌క్ష‌ల గ్రాస్ వ‌సూలు చేసింది. ఈ స‌మ్మ‌ర్ కి థ్రిల్ చేసేవిధంగా వుంద‌ని ప్రేక్ష‌కులు ఆద‌ర‌ణ ల‌భిస్తుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ…  ఊహకందని మలుపులతో స‌రికొత్త క‌థ‌నంతో ఆధ్యంతం ఆసక్తి కరంగా తెర‌కెక్కించిన చిత్రం మా వెంక‌టాపురం ఈ నెల 12న గ్రాండ్ గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడ‌ద‌ల‌య్యి మంచి చిత్రంగా ప్ర‌శంశ‌లు పొందుతుంది. వైజాగ్ నెప‌ధ్యంలో సాగే యూత్‌ఫుల్ థ్రిల్ల‌ర్ గా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది.  హీరో రాహుల్ న్యూ లుక్ కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు.
దర్శకుడు వేణు అద్భుతమైన సన్నివేశాలతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించాడు. మా చిత్రానికి సాయిప్ర‌కాష్ కెమెరా వ‌ర్క్ హైలెట్ గా నిలుస్తుంది. ప్ర‌స్తుతం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఈ మూడురోజుల‌కి 92ల‌క్ష‌ల గ్రాస్ వ‌సూలు చేసింది. రోజు రోజుకి మౌత్ టాక్ పెరిగి క‌లెక్ష‌న్లు పుంజుకుంటున్నాయి. ఈ చిత్ర విజ‌యానికి స‌హ‌క‌రించిన అంద‌రికి హ్రుద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు.. అని అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.