వెంకటాపురంకు పనిచేయడం ఛాలెంజింగ్‌గా ఉంది

Venkatapuram Music Director Achu Rajamani talks about the film his efforts

Venkatapuram Music Director Achu Rajamani talks about the film his efforts

హ్యాపీడేస్ ఫేం హీరో రాహుల్, మహిమా మక్వాన్ జంటగా  గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్, తుము ఫణి కుమార్ నిర్మాతలుగా నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ `వెంకటాపురం`. వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల‌కు రెడీ అయ్యింది. నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. సినిమా విడుదల సందర్భంగా`వెంక‌టాపురం మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు మీడియాతో మాట్లాడారు.

‘ ఒక్కొక్క సినిమాకు ఒక్కో త‌ర‌హా సంగీతం అందిస్తాం ఉదాహ‌ర‌ణ‌కు లవ్‌స్టోరీ అయితే ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాల‌నే దానిపై మ‌న‌కు ఒక ఐడియా ఉంటుంది. కానీ నిజ ఘ‌ట‌న‌లు ఆధారంగా సినిమా చేయాల‌నుకోగానే అస‌లు కంటెంట్ ఏంటి, ద‌ర్శ‌కుడు ఏం చెప్పాల‌నుకున్నాడ‌నేదే ముఖ్యం. డ‌బ్బుల కోస‌మే సినిమాలు చేయ‌ను. స్పీడుగా వర్క్ చేయ‌డం కంటే స‌రైన స‌మ‌యంలో అవుట్‌పుట్ ఇవ్వ‌డ‌మ‌నే దానినే నేను న‌మ్ముతాను.’

‘ వెంక‌టాపురం సినిమాను నిజ ఘ‌ట‌న‌లు ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించారు. ఈ సినిమాకు వ‌ర్క్ చేయ‌డం చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. వెంక‌టాపురం డిఫ‌రెంట్ జోన‌ర్‌లో తెర‌కెక్కింది. ద‌ర్శ‌కుడు వేణు కొత్త స్క్రీన్‌ప్లేతో సినిమాను తెర‌కెక్కించాడు. సాయిప్ర‌కాష్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు ప్ల‌స్ అవుతుంది. మంచి యంగ్ టీంకు ప‌నిచేసింది. హ్యాపీడేస్‌తో పోల్చితే రాహుల్ ఈ సినిమాలో కొత్త‌గా క‌న‌ప‌డ‌తాడు. ఈ సినిమా కోసం సిక్స్‌ప్యాక్ చేశాడు. అంతేగాక సాధార‌ణంగా మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ రాత్రి టైంలో ప‌నిచేస్తారు. కానీ నేను మాత్రం ఉద‌యం పూట ప‌నిచేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాను. సినిమాల‌ను సెల‌క్టివ్‌గా ఎంచుకొని పనిచేస్తాను అని చెప్పుకొచ్చాడు అచ్చు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.