‘గురు’ మూవీ రివ్యూ

Victory Venkatesh Rithika Singh latest Movie Guru Review by Sakalam

Victory Venkatesh Rithika Singh latest Movie Guru Review by Sakalam

సినిమా: గురు

నటులు : వెంకటేష్, రితికా సింగ్, ముంతాజ్ సర్కార్, నాజర్

సినిమాటోగ్రఫీ : శక్తివేల్

సంగీతం : సంతోష్ నారాయణన్

నిర్మాత : ఎస్. శశికాంత్

దర్శకత్వం : సుధా కొంగర‌

చాలామంది స్టార్‌ హీరోలు ఓ స్థాయికి వచ్చిన తర్వాత  తాము చేసే క్యారెక్టర్ల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా , తమ హీరోయిజం ఎలివేట్ అయితే చాలు అనుకొని చేతులు కాల్చుకుంటూ కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేస్తుంటారు. కానీ మరికొంతమంది తమ స్టామినాకు తగ్గట్లుగా వయసు పెరుగోతందని గుర్తించి జీవిత సత్యం తెలుసుకొని తమ వయసుకు తగ్గట్లుగా పాత్రలు చేసుకుంటూ జీవితంలో చివరిశ్వాస వరకూ నటుడిగా మిగిలిపోయే హీరోలు ఉన్నారు. ఈ సెకండ్ క్యాటగిరీలో ముందు వరుసలో ఉండే హీరో వెంకటేశ్. గత కొన్నేళ్ళుగా డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ తన కెరీర్‌కి ఎలాంటి ఢోకాలేదని నిరూపిస్తున్న వెంకటేశ్ లేటెస్ట్ మూవీ ‘గురు’. సుధా కొంగర దర్శకత్వంలో హిందీలో ‘సాలా ఖడూస్’ గా తెరకెక్కి తమిళంలో ‘ఇరుద్ది సుట్రు’ గా రీమేకై బ్లాక్ బస్టర్ హిట్ అయి ఇప్పుడు తెలుగులో గురు టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రితికా సింగ్ అనే అమ్మాయి  తెలుగు తెరకు పరిచయం అవుతున్న ఈ సినిమా అంచనాలను ఏమేరకు అందుకోగలిగింది. స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలకు మంచి రోజులు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోగలిగింది?

కథ :

బాక్సింగ్ అసోసియేషన్‌లో ఉండే కుళ్ళు రాజకీయాల వల్ల కెరీర్ కోల్పోయిన  బాక్సర్‌ ఆదిత్య (వెంకటేశ్) హిస్సార్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కోచ్‌గా పని చేస్తుంటాడు. భార్య కూడా తనని వదిలి వెళ్ళిపోవడంతో బాక్సింగే తన జీవితానికి సర్వస్వం అనుకొనే ఆదిత్య బాక్సింగ్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. అదే సమయంలో అసోసియేషన్‌లో బాక్సింగ్ హెడ్ కోచ్‌గా ఉండే దేవ్ కత్రి తో గొడవ కారణంగా ప్రొఫెషనల్ బాక్సర్లు ఎవరూలేని వైజాగ్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాడు ఆది. అలా హెడ్ ఆఫీస్‌నుండి వైజాగ్‌కు వచ్చిన ఆదిత్యకు అక్కడ బాక్సింగ్ కోచింగ్ నేర్చుకొనే లక్ష్మి (ముంతాజ్ సర్కార్) అనే ఓ అమెచ్యూర్ బాక్సర్‌ చెల్లెలు రామేశ్వరి అలియాస్ రాముడు (రితికా సింగ్)ను కలుస్తాడు. అయితే రామేశ్వరి అక్కడి పూర్ణా మార్కెట్‌లో కూరగాయలమ్ముకుంటూ ఇల్లు గడుపుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో రామేశ్వరిలోని బాక్సింగ్ టాలెంట్‌ను గుర్తించిన ఆది తనని ఓ ప్రొఫెషనల్ బాక్సర్‌ను చేయాలని కలగని తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చుపెట్టి ట్రైనింగ్ ఇస్తుంటాడు. అయితే  రామేశ్వరి మాత్రం ఆదిలోని నిజాయితీని, బాక్సింగ్ పట్ల ఉన్న తపనను గుర్తించకుండా చిన్నపిల్లలా వ్యవహరిస్తుంటుంది. అలాంటి సమయంలో క్వాలిఫైయింగ్ మ్యాచులు కొన్నింటిలో కావాలని ఓడిపోయిన రామేశ్వరిని తన దగ్గరినుండి వెళ్ళగొట్టేస్తాడు ఆది. ఆ తర్వాత అసలు ఏం జరిగింది? అసోసియేషన్‌లో ఆదికి శత్రువులుగా ఉన్న పెద్దలు రామేశ్వరి కెరీర్‌కు ఎలా అడ్డుపడతారు? ఇన్ని అడ్డంకుల మధ్య రామేశ్వరిని ఆది ఎలా ప్రొొఫెషనల్ బాక్సర్‌గా తీర్చిదిద్దుతాడు? కూరగాయలు అమ్ముకొనే ఓ సాధారణ అమ్మాయి ప్రపంచ చాంఫియన్‌గా ఎలా తయారైందన్నదే కథ.

ఎనాలసిస్:

స్పోర్ట్స్ సినిమాలు తీయడం అంటే మామూలు ఆరు పాటలు నాలుగు ఫైట్లు రెండు లిప్ కిస్సులు పెట్టేసి ఓ ఐటం సాంగ్‌తో చేసే కమర్షియల్ సినిమాలు తీసినంత ఆషామాషీ విషయమైతే కాదు. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న అనేక సున్నితాంశాలను చాలా జాగ్రత్తగా ఎవరి పేరూ బయటికిరాకుండా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చాలా సెన్సిబుల్‌గా అదే సమయంలో సినిమా హిట్ అవ్వడానికి అవసరమైన కమర్షియల్ ఇంగ్రేడియంట్స్‌ని మిక్స్ చేస్తూ తెరకెక్కించాల్సి ఉంటుంది. ఈ విషయంలో దర్శకురాలు సుధ కొంగర సక్సెస్ అయ్యిందనే చెప్పుకోవాలి.

హిందీ తమిళంలో ప్రూవ్ చేసుకున్న సినిిమాను తెలుగులో ఓ పెద్ద స్టార్‌తో తీయడం కొంచం రిస్క్ అయినప్పటికీ, ఆ రిస్క్ తీసుకున్నందుకు ఈరోజు గురు సినిమాతో మంచి హిట్ కొట్టి తన స్టామినా ఏంటో తెలుగు ఇండస్ట్రీకి చూపించారు సుధా కొంగర. ఓ రఫ్ బాక్సింగ్ కోచ్‌గా వెంకటేశ్‌ను రెడీ చెయ్యడంలోనూ, ఎక్కడా వెంకటేశ్ రెగ్యులర్ మ్యానరిజాలు రాకుండా చూసి, సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు ఇంటెన్స్ ఎమోషన్స్ క్యారీ చేయడంలో సక్సెస్ అయ్యారు.  స్పోర్ట్స్ సెలక్షన్లలో ఎలాంటి కుళ్ళు జరుగుతుందో చాలా సెన్సిబుల్‌గా ఎక్కడా బూతు ధ్వనించకుండా జాగ్రత్తపడ్డారు. అంతేగాక చిన్న కథను సుమారు రెండు గంటలపాటు  టైట్ స్క్రీన్‌ప్లేతో చాలా బాగా తెరకెక్కిం చారు.

ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లు సినిమాలో జీవం పోశాయి.  కథ ఎక్కడో బోర్ కొడ్తోందే అనే ఫీలింగ్ ప్రేక్షకులకు వచ్చే సమయంలో ఎమోషనల్ సీన్లతో కథ డీవియేట్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. దీనికితోడు శక్తివేల్ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణ్ సంగీతం సినిమాకు అసెట్ అనే చెప్పుకోవాలి. సినియాలో ప్రతీ ఫ్రేమ్ ఎంతో అందంగా కనిపించేలా శక్తివేల్ చాలా జాగ్రత్త తీసుకున్నాడు. అదే సమయంలో ఎడిటర్ ఇంకాస్త జాగ్రత్తగా కొన్ని సీన్లు ఎత్తేసి ఉంటే ఇంకా బాగుండేదనిపించింది. కొన్ని సీన్లలో సాలా ఖడూస్ సీన్లు అలానే వాడుకున్నారనిపించింది.

మరోవైపు సినిమా మొత్తంలో ప్రతి ఒక్కరినీ ఎట్రాక్ట్ చేసే క్యారెక్టర్ వెంకటేశ్‌దే. ఓ ఫ్రస్ట్రేటెడ్ బాక్సర్ ఎలా ఉంటాడు, తన స్టూడెంట్స్‌ని ఎలా తయారుచేయాలనుకుంటాడనే క్యారెక్టర్‌లో వెంకటేశ్ ఒదిగిపోయి నటించారు. ఇప్పటివరకు వెంకటేశ్ చేసిన సినిమాలకు చాలా భిన్నమైన క్యారెక్టర్లో అందరినీ మెప్పించాడు. ఎక్కడా క్యారెక్టర్‌నుండి బయటికి వచ్చినట్లుగా అనిపించలేదు. సినిమా ఫస్ట్‌ ప్రేమ్‌నుండి చివరి ఫ్రేమ్ వరకు సినిమా చూస్తున్నంతసేపూ స్క్రీన్‌పై ఆదిత్య క్యారెక్టరే కనిపిస్తుంది తప్ప వెంకటేశ్ కనిపించడు. అంతలా ఆ క్యారెక్టర్లో జీవించేశాడు.

కూరగాయలు అమ్ముకొనే ఓ అమ్మాయిలాగా, ఆ తర్వాత ఓ అమెచ్యూర్ బాక్సర్‌లాగా ఆ తర్వాత ఓ ప్రొఫెషనల్ బాక్సర్‌లాగా  రామేశ్వరి క్యారెక్టర్‌లో రితికాసింగ్ అద్భుతంగా నటించింది. తన కొత్త తరహా నటనతో అందరినీ ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. రామేశ్వరి అక్క లక్స్ పాత్ర చేసిన ముంతాజ్ సర్కార్ తన ఎమోషన్స్‌ని బాగా క్యారీ చేసింది. అదే సమయంలో జూనియర్ కోచ్‌గా చేసిన నాజర్‌ కామెడీ ఓ మాదిరిగా బాగున్నప్పటికీ కొన్ని డైలాగ్స్ చెబుతుంటే కాస్త ఓవర్ అనిపించింది.

సెకండాఫ్లో క్యారెక్టర్ల మధ్య ఎమోషన్స్‌ను మరింత పండించడానికి కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది.  అంతేగాక రామేశ్వరి ప్రొఫెషనల్ బాక్సర్’గా తయారయ్యే ప్రాసెస్‌ను ఇంకాస్త బలంగా చిత్రీకరిస్తే బాగుండేది.

 

ఓవరాల్: వెంకీ సీరియస్ నటనతో ఆకట్టుకొనే కొత్త తరహా సినిమా ‘ గురు’

 

రేటింగ్: 3.5 / 5

 

-శరత్‌చంద్ర

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.