‘ద్వారక’ మూవీ రివ్యూ

సినిమా: ద్వారక

నటులు: విజయ్ దేవరకొండ, పూజ జావేరి, మురళీ శర్మ
సంగీతం :సాయి కార్తీక్
నిర్మాతలు : ప్రద్యుమ్న చంద్రపతి, గణేష్ పెనుబోతు
దర్శకత్వం :శ్రీనివాస్ రవీంద్ర

 

పెళ్ళిచూపులు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో విజయ్ దేవరకొండ కెరీర్ టర్న్ తీసుకుంది. దీంతో పెళ్ళిచూపులు సినిమా తర్వాత విజయ్ హీరోగా వస్తున్న సినిమా కావడంతో ద్వారకపై అంచనాలు మొదటినుండి ఎక్కువగానే ఉన్నాయి. అయితే స్టోరీ సెలెక్షన్‌లో విజయ్ తీసుకున్న నిర్ణయం ఎంతమేరకు సక్సెస్ అయ్యింది.. సినిమా ఎలా ఉంది.

కథ :

అమీర్ పేటలో ఉండే ఎర్రశ్రీను ( విజయ్ దేవరకొండ) బ్యాచ్ చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు. ఒకసారి దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోయి తన్నులు తింటారు. ఆ తర్వాత ఓ దేవాలయంలో క‌ృష్ణుడి విగ్రహం దొంగతనం చేయడానికి ఒంటరిగా వెళ్ళిన శ్రీను అనుకోని పరిస్థితుల్లో గుళ్ళో ఓ అమ్మాయి వసుధ ( పూజా ఝవేరి)ని చూసి ప్రేమలో పడిపోతాడు. అయితే అక్కడ దొవగతనం చేయడంలో ఫెయిలైన శ్రీను అక్కడకి దగ్గర్లోని ఓ అపార్ట్మెంట్లో దాక్కుంటాడు. అదే సమయంలో శ్రీను దాక్కొన్న అపార్ట్మెంట్లో ఉండే రియల్ ఎస్టేట్ బ్రోకర్ (జెమిని సురేశ్) తన గురువు గురుమూర్తి( పృథ్వి) సలహామేరకు పూజలు చేసి తన సమస్య పరిష్కారం కోసం దేవుడి సహాయం కోసం ఎదురుచూస్తుంటాడు. తెల్లరగానే అపార్ట్మెంట్లో టెర్రస్ పైన పడుకొన్న శ్రీనుని చూసి దేవుడే స్వయంగా వచ్చా డని డిసైడ్ అయిపోయి ఎర్రశీనుకి పూజలు మొదలుపెడతారు. అలా పూజలు అందుకున్న ఎర్రశీను కాస్తా కృష్ణానంద స్వామిగా మారిపోతాడు. గురుమూర్తి కృష్ణానంద గురించి అందరికీ చెబుతూ ప్రచారం చేస్తుంటాడు. అలా బాబాగా అవతారం ఎత్తిన శ్రీను అక్కడ ఓ 50లక్షలరూపాయలు పోగైన తర్వాత వాటిని తీసుకొని పారిపోదామనుకొనే టైంలో అక్కడికి వచ్చిన వసుధని చూసి ఆగిపోతాడు. అప్పటికే ఎర్రశ్రీనుని తమ గుప్పిట్లో ఉంచుకున్న క్రిమనల్ లాయర్ రవి, ఎస్సై, మంత్రి కృష్ణానంద పేరుతో సొమ్ము చేసుకోవడానికి అలవాటుపడి శ్రీనుని బెదిరిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న శ్రీను ఎలా బయటపడ్డాడు? తనను అసహ్యించుకొనే వసుధ ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? బాబాగానే కొనసాగి డబ్బులు సంపాదిస్తుంటాడా లేక మారిపోతాడా అన్నదే కథ.

ఎనాలసిస్:

పెళ్ళిచూపులు అనే ఒకే ఒక్క సినిమా విజయ్ దేవరకొండ అనే ఓ హీరో లైఫ్ నే మార్చేసింది. నిజానికి ద్వారక అనే సినిమా పెళ్ళిచూపుల తర్వాత రావడంతో జనాల్లో ఎక్స్‌‌‌పెక్టేషన్లు ఎక్కువగా ఉన్నాయి. ఎవడే సుబ్రహ్మణ్యం నుండి తన క్యారెక్టర్ సెలక్షన్‌లో కేర్ తీసుకుంటున్న విజయ్ తన నాలుగో సినిమా ద్వారకలో క్యారెక్టర్ సెలక్షన్‌లో దృష్టిపెట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ సినిమా లో డిఫరెంట్ గా కృష్ణానంద స్వామి అవతారంలో కనిపించాడు. అంతేగాక దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర విజయ్‌ను కొత్తగా చూపించాడు. ‘ద్వారక’ సినిమా మొత్తం విజయ్ దేవరకొండ పాపులారిటీపైనే సాగింది. దర్శకుడు తయారుచేసిన క్యారెక్టర్లో దొంగగా, దొంగ బాబాగా, ప్రేమికుడిగా, సమాజ శ్రేయస్సు కోరుకునే మంచి వాడిగా అంచనాలకు తగ్గట్లుగా మంచిగా నటించాడు. బాబా అవతారంలో చేసే పనులు, స్నేహితులతో దొంగతనాలు చేయడంతోపాటు కామెడీ ట్రాక్ బాగా వర్కౌట్ అయ్యింది. హీరోయిన్ పూజా ఝవేరికి మంచి క్యారెక్టర్ దొరికింది. రొమాంటిక్ లిప్‌లాక్‌ సినిమాలో హీట్‌ని పెంచాయి. క‌ృష్ణానందస్వామి భక్తుడిలా పృథ్వి క్యారెక్టర్ బాగుంది. అతను చేసే పనులు సనిమాలో ఎంటర్‌టైనింగ్‌‌గా ఉన్నాయి. దొంగబాబాలను పట్టించే హేతువాది క్యారెక్టర్‌లో మురళీ శర్మ ఇంటెన్సిటీని పెంచారు. ఇన్ని క్యారెక్టర్లు ఉన్నప్పటికీ చాలావరకు స్పష్టంగా ఉండేందుకు పాత్రల్ని రాసుకోవడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎమోషనల్ సీన్స్‌తోపాటు హీరోయిన్ వల్ల హీరో పడే కష్టాలను బాగా తెరకెక్కించాడు. సాయి కార్తిక్ మ్యూజిక్, డైలాగ్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఉత్తేజ్‌కు చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ దొరికింది.

సినిమా రన్ టైమ్ కాస్త ఎక్కువనే చెప్పుకోవాలి. కొన్ని అనవసరమైన సీన్లు కట్ చేస్తే ఇంకా బాగుండేది. ఫస్టాఫ్, సెకండాఫ్‌ల్లో స్క్రీన్‌ప్లేలో ఇంకాస్త వేగం పెంచి ఉంటే బాగుండేది. అంతేగాక కొన్ని లాజిక్‌లేని సీన్లు చూడడానికి ఇబ్బందిగా అనిపించాయి. సినిమాలో నాలుగు పాటలు మాత్రమే ఉండటం అవి కూడా కథనంతో కలిసి సాగిపోవడం ఆకట్టుకుంది. సినిమాను ఎక్కువ కాలం షూట్ చేయడం వలన విజయ్ దేవరకొండ లుక్స్ లో కాస్త తేడా కనిపించింది.

ఓవరాల్: ద్వారకలోని క‌ృష్ణలీలలు ఆకట్టుకున్నాయి.

 

రేటింగ్ : 3 / 5

 

-శరత్‌చంద్ర

Have something to add? Share it in the comments

Your email address will not be published.