బాబూ చిట్టీ ఇంటికి రామ్మా

vijay-mallya-misled-us-on-wealth-sc-holds-mallya-guilty-of-contempt

vijay-mallya-misled-us-on-wealth-sc-holds-mallya-guilty-of-contempt

లండన్‌కు పారిపోయి గత ఏడాదిగా స్వదేశానికి రాకుండా తప్పించుకొని తిరుగుతూ ఈ మధ్యే లండన్‌ పోలీసులకు చిక్కి బెయిల్ తీసుకొని హాయిగా జీవితం వెళ్ళదీస్తున్న లిక్కర్ డాన్ విజయ్ మాల్యాపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఆస్తుల బదలాయింపుల కేసులో కోర్టు ధిక్కరణ క్రింద జూలై 10న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం మాల్యాను ఆదేశించింది.

మాల్యాపై కోర్టు ధిక్కార నేరాలను మోపాలని బ్యాంకుల కన్సార్టియం పెట్టుకున్న పిటిషన్‌ను నేడు సుప్రీంకోర్టు విచారించింది. అంతే కాకుండా మాల్యా వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సమన్లు జారీ చేసింది.

61ఏళ్ల మాల్యా భారత్‌లోని వివిధ బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయల మేరకు బకాయిపడ్డారు. వాటిని చెల్లించకుండా ఆయనపై రుణ ఎగవేత కేసులు, మనీ లాండరింగ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంతకు ముందే ఆస్తుల వివరాలను వెల్లడించాలని విజయ్ మాల్యాను ఆదేశించినా స్పందించకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది.

దీంతో ఇప్పటికే అనేక కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న మాల్యాకు న్యాయస్థానం తాజా ఆదేశాలతో ఆయన చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఒకవేళ మ్యాలా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాకపోతే ఆయనకు ఆరు నెలలపాటు శిక్ష పడే అవకాశం ఉంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.