విజయ్‌మాల్యాకు బెయిల్ మంజూరు

లిక్కర్ డాన్ విజయ్‌మాల్యా విషయంలో అంతా సాఫీగా జరుగుతుందనుకొనే సమయంలో కొత్త చిక్కులు ఎదురొచ్చిపడుతున్నాయి. భారత్‌ జారీ చేసిన లెటర్‌ ఆఫ్‌ రెగోరేటరీ ఆధారంగా యూకే పోలీసులు మాల్యాను అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం 9.30గంటలకు మాల్యాను అరెస్టు చేసిన యూకే పోలీసులు భారత్‌లోని సీబీఐ అధికారులకు సమాచారమందించారు.

మాల్యా అరెస్టయిన 3గంటల్లోనే షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది. మూడు గంటల క్రితం స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేసి వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరచగా బెయిల్ మంజూరైంది.

మనదేశంలో బ్యాంకులకు వేలాదికోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్ పారిపోయి తప్పించుకొని తిరుగుతున్న విజయ్‌మాల్యాను ఇండియాకి రప్పించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు దారినపడ్డాయి. మనీ లాండరింగ్ కేసు ఎదుర్కొంటున్న మాల్యాపై ఇప్పటికే అనేక అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. భారత్ మాల్యా పాస్ పోర్టును కూడా రద్దు చేసింది.

ఆయన్ని వెంటనే దేశం నుంచి పంపించేయాల్సిందిగా కూడా భారత్ బ్రిటన్ ను కోరింది. అయితే బ్రిటన్ చట్టాల ప్రకారం ఓ వ్యక్తి పాస్ పోర్ట్ రద్దయినా.. అతను బ్రిటన్ లోనే ఉండే అవకాశం ఉంటుంది. దీంతో విజయ్‌మాల్యా యథేచ్చగా లండన్‌లో తిరుగుతున్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.