లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా అరెస్ట్

Vijay Mallya, Who Fled India In 2016, Arrested In London By Scotland police and could be heading to India soon

Vijay Mallya, Who Fled India In 2016, Arrested In London By Scotland police and could be heading to India soon

లిక్కర్ కింగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మనదేశంలో బ్యాంకులకు వేలాదికోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్ పారిపోయి తప్పించుకొని తిరుగుతున్న విజయ్‌మాల్యాను లండన్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్నేళ్ళుగా విజయ్ మాల్యాను ఇండియాకి రప్పించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. అందులోభాగంగా మాల్యా మొత్తం 17 బ్యాంకులకు డబ్బులు ఎగ్గొటి లండన్ పారిపోయి వచ్చేశాడని, అతనిని భారత్‌కు అప్పగించాలని కోరిన నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. భారత హై కమిషన్ ఒక పిటిషన్ దాఖలు చేయడంతో లండన్ కోర్టు విచారణ జరిపి, వారంటు ఇచ్చిన తర్వాత స్కాట్‌లాండ్ యార్డు పోలీసులు ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం.

మాల్యాను భారత్ కు అప్పగించేందుకు ఈ మధ్యే బ్రిటన్ న్యాయ ప్రక్రియను మొదలుపెట్టింది. అయితే రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం మాల్యాను భారత్‌కు అప్పగించడం అంత సులువుగా కనిపించట్లేదు.

లండన్‌లో విజయ్‌మాల్యాను స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను త్వరలోనే వెస్ట్‌మిన్‌స్ట‌ర్‌ కోర్టులో హాజరుపరచనున్నారు. మనీ లాండరింగ్ కేసు ఎదుర్కొంటున్న మాల్యాపై ఇప్పటికే అనేక అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. భారత్ మాల్యా పాస్ పోర్టును కూడా రద్దు చేసింది. ఆయన్ని వెంటనే దేశం నుంచి పంపించేయాల్సిందిగా కూడా భారత్ బ్రిటన్ ను కోరింది. అయితే బ్రిటన్ చట్టాల ప్రకారం ఓ వ్యక్తి పాస్ పోర్ట్ రద్దయినా.. అతను బ్రిటన్ లోనే ఉండే అవకాశం ఉంటుంది. దీంతో విజయ్‌మాల్యా యథేచ్చగా లండన్‌లో తిరుగుతున్నారు.

విజయ్‌మాల్యా అరెస్టు తర్వాత అతన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది భారత ప్రభుత్వం అందులోభాగంగా ఇప్పటికే బ్రిటన్ హై కమిషన్‌కు ఫిర్యాదు చేసిన సిబిఐ  అతన్ని వెనక్కి తీసుకురావడానికి వారెంట్ తీసుకొని వెళ్ళనున్నారు. బ్రిటన్ ప్రభుత్వం భారత్‌తో కలిసి ఎంతమేరకు సహకరిస్తే అంతేవేగంగా విజయ్‌మాల్యాను వెనక్కితీసుకురావాలని యోచిస్తోంది సిబిఐ. స్టేట్‌బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియంకు మొత్తం  9వేల కోట్లకు పైగా రుణాలు చెల్లించకుండా ఎగవేసిన లిక్కర్ కింగ్ మాల్యా.. గత సంవత్సరం మార్చి 2వ తేదీన రాత్రికి రాత్రి లండన్ పారిపోయారు.

మొత్తం 17 బ్యాంకులకు రుణాలు ఎగవేసిన విజయ్‌మాల్యా ఆస్థులను అమ్మకాలకు పెట్టేశాయి బ్యాంకులు. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత, యూబీ గ్రూప్ చైర్మన్ అయిన విజయ్ మాల్యా గతంలో రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.