టార్గెట్ 2019: లగడపాటి దారి ఎటువైపు..?

Vijayawada ex mp Lagadapati rajagopal in dilema to join TDP or YSRCP

Vijayawada ex mp Lagadapati rajagopal in dilema to join TDP or YSRCP

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు సమయంలో విభజనను అడ్డుకోవడంలో పావులు కదపడంలో ముందున్న విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇప్పుడేం చేస్తున్నారు. అసలు ఎక్కడ ఉంటున్నారు??? 2014 ఎన్నికల్లో కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీతోపాటు లగడపాటి కూడా కనుమరుగైపోయారు.

రాష్ట్రం విభజన తరువాత లగడపాటి రాజగోపాల్ రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అయితే రాజకీయాల్లోకి పునఃప్రవేశంచేయాలని యోచిస్తున్నారు . 2019 ఎన్నికలకు ముందు లగడపాటి రాజకీయాల్లోకి మళ్ళీ యాక్టివ్‌గా తయారవ్వాలని అనుకుంటున్నారట. ఈమధ్య విజయవాడలో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో లగడపాటి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీఓ అధికారులతో విజయవాడ ఎంపీ కేశినేని నాని గొడవ తరువాత జరుగుతున్న రాజకీయ మార్పులను తనకు అనుకూలంగా మార్చకోవాలని అనుకుంటున్నారు లగడపాటి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉండడంతో ఇప్పటినుండి గ్రౌండ్ తయారుచేసుకుంటే అప్పుడు ఈజీగా ఉంటుందనుకుంటున్నారు లగడపాటి.

అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం భూగర్భంంలో ఉన్న కాంగ్రెస్‌లో ఉంటే వర్కౌట్ కాదనే విషయం తెలుసుకున్న లగడపాటి ఇప్పుడు తనకున్న రెండే ఆఫ్షన్లు పరిశీలిస్తున్నారు. ఆయన ఇప్పుడు టిడిపి లేదా వైఎస్ఆర్సీపి చేరతారోనని ఒక గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో లగడపాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో అమరావతిలో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన టిడిపి లో చేరతారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. తన అనుచరులుకూడా వైఎస్ఆర్ సిపి కంటే టిడిపి చేరడానికే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అమరావతిలో నిర్మించిన తాత్కాలిక సెక్రటేరియట్ అద్భుతంగా ఉందని, రాజధాని నిర్మాణ తీరుపై లగడపాటి ముఖ్యమంత్రి చంద్రబాబుని ప్రశంసించారు.

లగడపాటికి ఉన్న మరో ఆఫ్షన్ వైఎస్సాఆర్సీపీ. 2004లో విజయవాడ ఎంపీగా గెలుపొందిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకంగా తయారయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డితో చాలా అన్యోన్యంగా ఉంటూ కేంద్రంలోనూ తనదైన స్టైల్లో రాజకీయాలు నడిపారు. అదే ఊపులో 2009లో మళ్ళీ విజయవాడ ఎంపీగా గెలిచిన రాజగోపాల్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యాన్ని కొనసాగించినప్పటికీ వైఎస్సాఆర్సీపీ ఏర్పాటు చేసిన తర్వాత ఆయనకు పరోక్షంగా మద్దతు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీని మాత్రం వీడలేదు.

అయితే రాష్ట్ర విభజన సమయంలో జగన్‌తో సహా అందరు ఎపి ఎంపీలతో కలసి లోక్‌సభలో రచ్చ రచ్చ చేసి పెప్పర్ స్ప్రే సైతం వాడిన లగడపాటి తనకు జగన్‌తో ఉన్న అనుబంధాన్ని మళ్ళీ బయటికి తీసుకురావాలనుకుంటున్నారు. ఒకవేళ రాజగోపాల్ వైసీపీలో చేరితే విజయవాడలో బలమైన నాయకుడిగా తయారయ్యే అవకాశాలున్నాయంటున్నారు ఆయన సన్నిహితులు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.