వినోద్ ఖన్నా కన్నుమూత

vinod-khanna-veteran-actor-and-politician-passes-away-at-70-in-mumbai-as-he-was-suffering-from-cancer

vinod-khanna-veteran-actor-and-politician-passes-away-at-70-in-mumbai-as-he-was-suffering-from-cancer

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నా కన్నుమూశారు. 1968లో వచ్చిన ‘మన్‌ కా మీట్‌’ చిత్రం ద్వారా వినోద్‌ ఖన్నా బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఆయన సినీ ప్రస్థానం బాలీవుడ్‌లో అప్రతిహాతంగా కొనసాగింది. 2015 వరకు దాదాపు 140 చిత్రాల్లో ఆయన నటించారు. ‘మేరే గావ్‌ మేరా దేశ్‌’, ‘గద్దర్‌’(1973), ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’, ‘రాజ్‌పుత్‌’, ‘ఖుర్బానీ’, ‘దయావన్‌’ తదితర చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచుకున్నారు. చివరిసారిగా దిల్‌వాలే చిత్రంలో కన్పించారు.

కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధ పడుతున్న ఆయన  ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 70 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో బాధపడుతూ  తుది శ్వాస విడిచారు. గతంలో వినోద్ ఖన్నా క్యాన్సర్ తో బాదపడుతున్నారన్న వార్తలు వినిపించినా కుటుంబ సభ్యులు ఆ వార్తలను ఖండించారు.

సినిమాల్లోనే కాక రాజకీయ రంగంలో కూడా వినోద్‌ ఖన్నా రాణించారు. 2002లో వాజ్ పాయ్ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా సేవలందించారు. 2014లో గురుదాస్ పూర్ నుంచి ఎంపికగా ఎన్నికయ్యారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె.

Have something to add? Share it in the comments

Your email address will not be published.