పంతం నెగ్గించుకున్న కోహ్లీ

Virat Kohli word is over by Ravi shastri selection as Head Coach

విరాట్ కోహ్లీ ఈమధ్య ఏదేమైనా చేసి తన పంతం నెగ్గించుకొనే పనులు చేస్తున్నాడు. తనతో కాస్త తేడాగా ఉంటున్న సహచరులను పక్కనబెట్టేయడానికి కూడా వెనుకాడని కోహ్లీ, కోచ్ ఎంపిక విషయంలోనూ అదే పద్ధతిని అవలంబించాడు. మొదటి నుంచి కోహ్లీ మద్దతు ఇస్తున్న రవిశాస్త్రి ఎంపికపై ఆఖరి వరకు ఉత్కంఠ కొనసాగినా..అందరూ ఊహించినట్లుగానే కోచ్‌గా రవిశాస్త్రినే పదవి వరించింది. దీంతో కోచ్ ఎంపిక ప్రక్రియలో కెప్టెన్ కోహ్లీ పంతం నెగ్గినట్లైంది.

Virat Kohli word is over by Ravi shastri selection as Head Coach

గ‌తేడాది ర‌విశాస్త్రిని కోచ్ కాకుండా అడ్డుకోవ‌డంలో సక్సెస్ అయిన గంగూలీ.. ఈసారి మాత్రం అత‌నికి ఎలా చాన్స్ ఇచ్చాడ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తికరంగా మారింది. ముఖ్యంగా కోచ్ ఎంపిక సీఏసీ చేతుల్లోనే ఉండ‌టం.. దానికి చీఫ్ గంగూలీ కావ‌డంతో ర‌విశాస్త్రికి ఈసారీ కూడా మొండిచెయ్యే అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే కోచ్ అభ్యర్థుల విషయంలో మ‌ధ్య‌లో సెహ్వాగ్ పేరు కూడా బ‌లంగా తెర‌పైకి వ‌చ్చింది. కానీ చివ‌రికి కోహ్లి కోరుకున్న‌ట్లు ర‌విశాస్త్రినే నియ‌మించ‌క త‌ప్ప‌లేదు.

నిజానికి ఈ సారి కూడా ర‌విశాస్త్రికి కోచ్ ప‌ద‌వి ద‌క్క‌కుండా ఉండేందుకు గంగూలీ ప్ర‌య‌త్నించాడు. శాస్త్రి పేరును అత‌ను తీవ్రంగా వ్య‌తిరేకించిన‌ట్లు బోర్డు వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కానీ సీఏసీలో సభ్యుడైన స‌చిన్ ఒత్తిడి మేర‌కు గంగూలీ వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌లేద‌ని స‌మాచారం. అయితే ఈ ఎంపికలో తనదైన స్టైల్లో పంచ్ వేశాడు గంగూలీ. హెడ్ కోచ్ ప‌ద‌విలో త‌న మాట నెగ్గ‌క‌పోయినా.. బౌలింగ్ కోచ్ విష‌యంలో మాత్రం ర‌విశాస్త్రి కోరుకున్న భ‌ర‌త్ అరుణ్‌ను కాద‌ని త‌న చాయిస్ జ‌హీర్‌ఖాన్‌ను నియ‌మించాడు గంగూలీ. అటు విదేశాల్లో ప్ర‌త్యేకంగా బ్యాటింగ్ క‌న్స‌ల్టెంట్ అంటూ ద్ర‌విడ్‌ను నియ‌మించి.. ర‌విశాస్త్రి పాత్ర‌ను ప‌రిమితం చేసే ప్ర‌య‌త్నం చేశాడు.

See Also: టార్గెట్ 2019: కెటిఆర్ ఏం చేయబోతున్నారో తెలుసా??

నిజానికి జ‌హీర్‌ను బౌలింగ్ కోచ్‌ను చేస్తానంటేనే ర‌విశాస్త్రికి ప‌ద‌వి ఇవ్వ‌డానికి అంగీక‌రిస్తాన‌ని గంగూలీ తేల్చి చెప్పాడ‌ని బోర్డు వ‌ర్గాలు తెలిపాయి. జ‌హీర్‌కి ఉన్న అనుభ‌వం, ఇప్పుడున్న టీమ్‌తో ఉన్న మంచి సంబంధాల కార‌ణంగా అత‌ని పేరును ఎవ‌రూ వ్య‌తిరేకించ‌లేక‌పోయారు. జ‌హీర్‌, ద్ర‌విడ్‌ల‌ను నియ‌మించి ర‌విశాస్త్రి పాత్ర‌ను సీఏసీ ప‌రిమితం చేసింద‌ని కామెంటేట‌ర్ హ‌ర్షా భోగ్లే ట్వీట్ చేశాడు. దీంతో రానున్న రెండేండ్లకుగాను చీఫ్ కోచ్‌గా రవిశాస్త్రిని, బౌలింగ్ కోచ్‌గా జహీర్‌ఖాన్, బ్యాటింగ్ సలహాదారునిగా రాహుల్ ద్రవిడ్‌ను నియమిస్తున్నట్లు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా అధికారికంగా ప్రకటించారు

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.