ట్రాఫిక్ రూల్ అతిక్రమించారా?? అయితే మీకు మూడినట్లే

Voilated a traffic rule The increased penalty may leave you cry

Voilated a traffic rule The increased penalty may leave you cry

భారతదేశ రోడ్డు భద్రతా వ్యవస్థలో ఈరోజు చరిత్రలో మిగిలిపోయే రోజు. ప్రజల భద్రత నిమిత్తం కేంద్రప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం అమలులో ఇది చరిత్రాత్మక అడుగు. మన రహదారులను భద్రంగా ఉంచడానికి, లక్షల మంది అమాయకుల ప్రాణాలను కాపాడటానికి ఈ బిల్లుని పటిష్టంగా అమలు చేస్తే ఖచ్చితంగా  ఉపయోగపడుతుంది. గతేడాది కేంద్ర ఏర్పాటుచేసిన 18 రాష్ట్రాల రవాణా మంత్రుల కమిటీ సిఫార్సుల ఆధారంగా మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లును రూపొందించిన కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టగా లోక్‌సభ ఆమోదించింది.

ఈ సవరణల ప్రకారం ఇప్పటివరకు ఉన్న జరిమానాలన్నీ భారీగా పెరిగిపోనున్నాయి. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలను నిర్దేశిస్తూ ఈ బిల్లును రూపొందించారు. మద్యం తాగి వాహనం నడిపిన వాళ్లకు 10 వేల రూపాయలు జరిమానా, గుర్తు తెలియని వాహనాలు ఢీకొట్టి వెళితే మృతులకు పరిహారం రూ.రెండు లక్షలకు పెంపు వంటి విప్లవాత్మక ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. రోడ్డు ప్రమాద మృతులకు పది లక్షల పరిహారం మరో ముఖ్యమైన నిబంధన. అంతేగాకుండా లైసెన్సు లేకుండా వాహనాలు నడిపేవారికి ఇంతకుముందు  500 రూపాయలు జరిమానా విధిస్తుండగా అది 5 వేలకు పెంచారు. అలాగే మద్యం తాగి వాహనం నడిపేవారికి వేసే ఫైన్ గతంలో  2వేల రూపాయలు ఉండగా అది ఇప్పుడు 10 వేల రూపాయలకు పెరిగింది.

హెల్మెట్‌ లేకుండా డ్రైవింగ్ చేస్తే  గతంలో వంద రూపాయలు కట్టించుకొనేవాళ్ళు, ఇప్పుడు కొత్త సవరణల ప్రకారం వెయ్యి రూపాయలు జరిమానా కట్టడంతోపాటు మూడు నెలల పాటు లైసెన్స్‌ కూడా సస్పెండవుతుంది.

ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్న మైనర్ డ్రైవింగ్‌పై కేంద్రం సీరియస్‌గానే ద‌ృష్టిపెట్టింది. మైనర్లు వాహనం నడిపినప్పుడు ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే, వాళ్ల తల్లిదండ్రులకు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తారు.  పిల్లలు తప్పు చేస్తే వారి తల్లిదండ్రులు, గార్డియన్లను బాధ్యులుగా చేస్తోంది కొత్త చట్టం. దాంతోపాటు వాహనం రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేయడం అలాగే బాధితుల కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని పదిరెట్లు పెంచారు.

కొత్త చట్టం ప్రకారం మోటారు వాహన ప్రమాదాల్లో థర్డ్‌​ పార్టీ బాధ్యత అన్‌లిమిటెడ్ అవుతుంది. ప్రమాదాల్లో ఎవరైనా మరణిస్తే 10 లక్షలు, తీవ్రంగా గాయపడితే 5 లక్షల చొప్పున చెల్లించాలి.  అంతేగాక ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.500 జరిమానా, అధికారుల ఆదేశాలను లెక్క చేయకుంటే రూ.2000 జరిమానా నిబంధనను పొందుపరిచారు. ముఖ్యంగా కార్లలో సీటు బెల్ట్‌ పెట్టుకోకపోతే వెయ్యి రూపాయల జరిమానా, మూడు నెలల లైసెన్సు రద్దు నిబంధనలను కొత్త చట్టంలో చేర్చారు.

మోటారు వాహ‌నాల స‌వ‌ర‌ణ బిల్లు -2016 కింద వివిధ జ‌రిమానాలలో ప్ర‌తిపాదించిన స‌వ‌ర‌ణ‌లు

సెక్ష‌ను   పాతనిబంధ‌న‌/ జ‌రిమానా కొత్త‌గా ప్ర‌తిపాదించిన నిబంధ‌న‌/ అతి త‌క్కువ జ‌రిమానా
177 జ‌న‌ర‌ల్‌ రూ. 100 రూ.500
న్యూ 177A రోడ్డునిబంధ‌న అతిక్ర‌మ‌ణపైన నియ‌మాలు రూ.100 రూ. 500
178 టికెట్లేకుండా ప్ర‌యాణం రూ. 200 రూ. 500
179 అధికారుల ఆదేశాలను పాటించకపోవడం రూ. 500 రూ. 2,000
180 లైసెన్సులేకుండా అన‌ధికారికంగా వాహ‌నాన్ని వినియోగించడం రూ. 1,000 రూ. 5,000
181 లైసెన్సులేకుండా వాహనాన్ని నడపడం రూ. 500 రూ. 5,000
182 అన‌ర్హులైఉన్నా వాహనాన్ని నడపడం రూ. 500 రూ. 10,000
182 B ఎక్కువపరిమాణం కలిగిన  వాహ‌నాలు న్యూ రూ. 5000
183 అతి వేగంగా నడపడం రూ. 400 ఎల్ ఎమ్ వి కి రూ.1,000,  మ‌ధ్య‌త‌ర‌హా ప్ర‌యాణికుల వాహ‌నానికి రూ. 2,000
184 అపాయక‌రంగా నడిపితే  జ‌రిమానా రూ. 1,000 రూ. 5,000 వ‌ర‌కు
185 తాగివాహ‌నాన్ని న‌డ‌పడం రూ.2,000 రూ. 10,000
189 వేగంగా /  పోటీ పెట్టుకొని వాహ‌నాన్ని న‌డ‌ప‌డం రూ. 500 రూ. 5,000
192 A అనుమ‌తి లేకుండా వాహ‌నం న‌డ‌ప‌డం రూ. 5,000 వ‌ర‌కు  రూ. 10,000 వరకు
193 లైసెన్సువిధానాల అతిక్ర‌మ‌ణ‌ న్యూ రూ. 25,000 నుండిరూ. 1,00,000
194 ఎక్కువ లోడు వేయడం రూ. 2,000, ప్ర‌తి అద‌న‌పు ట‌న్నుకు రూ. 1,000 రూ.20,000 మరియు ప్ర‌తి అద‌న‌పు ట‌న్నుకు రూ. 2,000
194 A స్థాయినిమించి ప్ర‌యాణికుల‌ను నింప‌డం ప్ర‌తి అద‌న‌పు ప్ర‌యాణికునిపైన రూ.1,000
194 B సీట్ బెల్టు లేకపోతే రూ. 100 రూ.1,000
194 C ద్విచ‌క్ర‌వాహ‌నాల‌పైన ప‌రిమితికిమించి ప్ర‌యాణికులు రూ.100 రూ.2,000 ; మూడు నెల‌ల‌ పాటు లైసెన్సు లేకుండా అన‌ర‌ర్హ‌త‌
194 D హెల్మెట్ లేక‌పోతే రూ.100 రూ.1000 ; మూడు నెల‌ల‌ పాటు లైసెన్సు లేకుండా అన‌ర్హ‌త‌
194 E ఎమ‌ర్జెన్సీ వాహ‌నాల‌కు దారి ఇవ్వ‌క‌పోతే న్యూ రూ.10,000
196 ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడపడం రూ.1,000 రూ.2,000
199 బాల‌లు వాహ‌నాలు న‌డిపితే న్యూ సంర‌క్షకుడు/ య‌జ‌మాని నేర‌స్తులుగా ప‌రిగ‌ణ‌న‌. మూడు సంవ‌త్స‌రాల జైలు శిక్ష‌తో పాటు రూ.25,000 జ‌రిమానా. నేరారోప‌ణ ఎదుర్కొంటున్న బాలల్ని జెజె చ‌ట్టం కింద విచార‌ణ‌. మోటారు వాహ‌నం యొక్క రిజిస్ట్రేష‌న్ ర‌ద్దు.
206 డాక్యుమెంట్ల స్వాధీనంలో అధికారుల అధికారం సెక్ష‌న్ లు 183, 184, 185, 189, 190, 194C, 194D,194E ల కింద డ్రైవింగ్ లైసెన్సుల స‌స్పెన్ష‌న్
210 B అధికారులు చేసే నేరాలు సంబంధిత సెక్ష‌న్ కింద రెండింత‌ల జ‌రిమానా

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.