పవన్‌కళ్యాణ్‌తో ఇంకా జర్నీ చేయాలని ఉందంటున్న దర్శకుడు

Wants to do more films with pawan kalyan says Katamarayudu director Dolly

Wants to do more films with pawan kalyan says Katamarayudu director Dolly

గోపాల గోపాల తర్వాత కాటమరాయుడితో తెలుగు ఇండస్ట్రీలో ఓ రేంజ్ డైరెక్టర్‌గా ఎదిగిపోయిన దర్శకుడు కిషోర్ కుమార్ పార్థసాని (డాలీ). కెరీర్ మొదట్లో కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే సినిమాతో మంచి టేస్టున్న దర్శకుడిగా పేరుతెచ్చుకొని ఆ తర్వాత  తడాఖా, గోపాల గోపాల ఇప్పుడు కాటమరాయుడు అనే రీమేక్ సినిమాలు చేసిన డాలీ ప్రస్తుతం కాటమరాయుడు సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌లాంటి స్టార్‌తో పనిచేయడం చాలా హ్యాపీగా ఉందంటున్న డాలీ పీకెతో కలిసి ఇంకా జర్నీ చేయాలని ఉందని చెబుతున్నారు.

కాటమరాయుడు సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న డాలీ మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు. ఆయన మాటల్లోనే..

‘ శుక్రవారం విడుదలైన తర్వాత మొదటిరోజు ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి. అయితే శనివారం మార్నింగ్‌షోకి కాస్త పబ్లిక్ తగ్గినట్లుగా అనిపించినప్పటికీ ఆదివారంరోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. ‘గోపాల గోపాల’ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని అనుకున్నాను. అయన కూడా ఒప్పుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకోమన్నారు. అదే సమయంలో కళ్యాణ్‌గారు పిలిచి ఈ ప్రాజెక్ట్ చేయమన్నారు. అలా నేను ఈ ప్రాజెక్టులోకి వచ్చాను. ‘వీరమ్’ సినిమాలో సెకండ్ పాయింట్‌గా ఉన్న లవ్ ట్రాక్‌ని ఎలివేట్ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రేమని ఎలివేట్ చేసే ఒక మంచి పాయింట్ ఉందని అనిపించింది. అందుకే ఆ సినిమా చేద్దామని ఆయనకు చెప్పగానే ఓకే అన్నారు. తమిళంలో సెకండాఫ్లో లవ్ ట్రాక్ ఉంటే తెలుగులో మాత్రం ఫస్టాఫ్లోనే లవ్ యాంగిల్ తీసుకొచ్చాను. కథను చిన్న చిన్న మార్పులు చేశాం. అవన్నీ ఆయనకు నచ్చాయి. అందుకే సినిమా ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది.
‘ నేను రీమేక్ ఎప్పుడూ మక్కికి మక్కీ తెసేయను. నా సినిమాలూ ఏది చూసిన అర్థమవుతుంది. ఎక్కడో ఒకదగ్గరనుంచి మనకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి. నా దగ్గరకు ఒక రీమేక్ తీసుకొచ్చి మక్కికి మక్కీ తీసేయమంటే నేను చేయను. అందులో నుండి ఒక ఇన్స్పిరేషన్ రావాలి. అప్పుడే చేస్తాను. వీరమ్‌లో బేసిక్ లైన్ బాగుంటుంది. అందుకే అది తీసుకున్నాను. ఆ ట్రైన్ ఫైట్ అన్నీ బాగా డిజైన్ చేశారు. అందుకే వాటిని అలానే ఉంచాను. కానీ ఫస్టాఫ్ మొత్తం మార్చేశాం. ఒరిజినల్ వెర్షన్ నుండి కేవలం ఇన్స్పిరేషన్ మాత్రమే తీసుకున్నాం. శృ‌తిహాసన్  సినిమాలో చాలా బాగా చేసింది. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.’

‘కథ మీద క్లారిటీ ఉంటే పెద్ద కష్టమేమీ ఉండదు. అది పవన్ కళ్యాణ్ అయినా సరే అమితాబ్ బచ్చన్ అయినా సరే. కథ క్లియర్ గా ఉండి, ఏ సీన్లు చేయాలో క్లారిటీ అంతా సాఫీగా సాగిపోతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా కొత్తగా ఉందని, ఆయన నటన కూడా చాలా బాగుందని అంటున్నారు. ఇంతకూ ముందు సినిమాల్లో చూడని కొత్త పవన్ కళ్యాణ్ ను ఈ సినిమాలో చూశాం అన్నారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. ముఖ్యంగా లవ్ సీన్లలో ఆయన నటన చాలా కొత్తగా ఉంది. ఇది చాలా కష్టమైన పని. ఒక ఐదుగురు అన్నదమ్ములు ఒంటరిగా ఉన్నప్పుడు మందే తాగుతారు. ఆ పాయింటే సినిమాలో ముందు ముందు మంచి కామెడీని పండించింది. కథ డిమాండ్ చేస్తే ఏం చేసినా తప్పులేదు.’

‘నేననుకోవడం సెకాండాఫ్లోనే కథ ఉంటుంది. ఫస్టాఫ్ అంతా ఎంటర్టైనింగానే ఉంటుంది. కథకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అవి వచ్చినప్పుడు సినిమా కాస్త ఆగుతుంది. కథలో ట్విస్ట్ కాస్త ఆలస్యంగానే రావాలి. అందుకే కథ రెండవ భాగంలో స్టార్ట్ అవుతుంది. ఆయనతో పని చేయడం చాలా బాగుంటుంది. ఆయన కోపంగా ఉంటారని, సెట్లోంచి వెళ్ళిపోతారని నేను కూడా విన్నాను. కానీ అలాంటిదేమీ లేదు. ఆయనకు నచ్చిన సీన్స్ చెబితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆయనతో మాట్లాడితే చాలా విషయాలు చెబుతుంటారు. అలాంటి వ్యక్తితో ఇంకాస్త ఎక్కువ జర్నీ చేయాలని అనిపిస్తుంది.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.