కాటమరాయుడి కంటే బూతే బెటర్ : రామ్‌గాపాల్ వర్మ

watching-porn-is-better-than-katamarayudu-says-ramgopal-varma

watching-porn-is-better-than-katamarayudu-says-ramgopal-varma

రామ్‌గోపాల్‌ వర్మకి మెగా ఫ్యామిలీ అంటే అదోరకమైన చెప్పలేని అభిమానం. ఆ  అభిమానం ఏంటనేది జగమెరిగిన విషయమే. అవకాశం దొరికితే చాలు మెగాస్టార్, పవర్ స్టార్, స్టార్ ఎవరైనా చాలు ఇలా ఎవర్నీ విడిచిపెట్టడు వర్మ.  సాయంత్రం అయ్యిందంటే చాలు వర్మ ఓ రెండు పెగ్గులు వేసుకుంటాడు… ట్విట్టర్‌లో ఎప్పుడు ఎవరిపై చురకేలస్తాడానని నెటిజన్లు ఎదురుచూడడం కామన్ అయిపోయింది. కెలకడం బాగా అలవాటైన వర్మపై ఓ సారి నాగబాబు, ఇంకోసారి చిరంజీవి, ఆ తర్వాత పవన్‌కళ్యాణ్‌.. తమదైన స్టయిల్లో వర్మకి కౌంటర్లు ఇచ్చేశారు.

అయినప్పటికీ వర్మ ఎప్పుడు ఎవరిపై ప్రేమ కురిపిస్తాడో.. ఎవరిని టార్గెట్ చేసుకుని విమర్శలతో ఎక్కేస్తాడో ఎవరూ అంచన వేయలేరు. ఒకప్పుడు పీకెపై వర్మ చూపించిన అభిమానం కాస్తా ఇప్పుడు ఓ రేం‌జ్‌లో టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్నాడు. లేటెస్ట్‌గా వర్మ ‘కాటమరాయుడు’పై చేసిన ట్వీట్లు ఇప్పుడో దుమారాన్ని రేపుతున్నాయి.

 

watching-porn-is-better-than-katamarayudu-says-ramgopal-varma

సుబ్బారావు అనే ఓ వ్యక్తి తనతో  ‘కాటమరాయుడు’ చూడటం కంటే పోర్న్ సినిమా చూడటం మేలని అన్నాడని…. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నందుకు గర్వపడటం మాని.. ఒక మంచి సినిమాను ప్రొడ్యూస్ చేయాలని ట్వీట్ చేశాడు. అంతేగాక పవన్ అభిమానులు గొర్రెల్లాంటి వాళ్లని.. వాళ్లకు ఎంత చెప్పినా వేస్ట్ అనే అర్థం వచ్చేలా కూడా వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పవన్ బాహుబలి-2 ట్రైలర్ చూశాక కొంత అయినా నేర్చుకుని.. దానికి తగ్గట్లుగా సినిమాలు తీయాలని సలహా ఇచ్చాడు వర్మ. ఐతే ఈ వ్యాఖ్యలన్నీ సూటిగా చేయలేదు వర్మ. ఎవరో సుబ్బారావు అన్నాడని.. ఇంకెవరో జ్నానేశ్వర్ చెప్పాడని.. తన పనిమనిషి అందని.. ఇలా ఎవరెవ్వరి పేర్లో వాడాడు. కానీ ఏం చెప్పాలనుకున్నాడో మాత్రం చెప్పేశాడు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.