భూమా హఠాన్మరణానికి దారితీసిన కారణాలు ఏమిటి?

what are the causes leading to sudden death of bhuma nagirddy

what are the causes leading to sudden death of bhuma nagirddy

హైదరాబాద్: భూమా నాగిరెడ్డి ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. అసలు ఆయన గుండెపోటు వచ్చేంత ఒత్తిడికి ఎందుకు లోనయ్యాడు? భూమాని ఒత్తిడి చేసిన ఆ అంశాలు ఏమిటి? మృతికి ముందు రోజు విజయవాడలో ఏం జరిగింది? ఈ అనుమానాలతో అసలు భూమా నాగిరెడ్డి మరణం సహజమేనా కాదా అనేది చాలా మంది మనసులో మెదులుతున్న ప్రశ్న. అసలు ఏం జరిగింది?

ఎంఎల్సీ నోటిఫికేషన్ రాకముందే కర్నూల్ జిల్లాకు చెందిన కొంతమంది గతంలో ఉన్న నాయకులతోపాటు కొత్తగా చేరిన వారిలో కొంత మందికి మీకంటే మీకు ఎంఎల్సీ పదవి ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు వాగ్దానం చేశారు. భూమా వైసీపీ నుండి టీడీపీలోకి తిరిగి చేరినప్పుడు మంత్రిపదవితో పాటు భూమా సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డికి కూడా ఎంఎల్సీ ఇస్తానని ఎంఎల్ఏ బాలకృష్ణ సమక్షంలో ముఖ్యమంత్రి వాగ్దానం చేశారు. ఇదిలా ఉండగా భూమా మళ్లీ తిరిగి టీడీపీలోకి చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన శిల్పా వర్గానికి చెందిన వారిని మరుసటి రోజు పిలిచి నియోజవర్గం ఇంచార్జితోపాటు ఎంఎల్ సీ సీటు కూడా కేటాయిస్తాయని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈవిధంగా ఒకే హామీని ఒకరికి తెలియకుండా మరొకరికి ముఖ్యమంత్రి ఇచ్చారు.

ఎంఎల్సీ నోటిఫికేషన్ వెలువడింది. భూమా నాగిరెడ్డికి  ఇచ్చిన వాగ్దానాన్ని పక్కనపెట్టి శిల్పా చక్రపాణికి టికెట్ ఇచ్చారు. దాంతో భూమా నాగిరెడ్డి తనకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదని తన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డికి మొండిచెయ్యి చూపించారని చంద్రబాబు నాయుడిపై ఆగ్రహించాడు. శిల్పా చక్రపాణి ఎంఎల్సీ టికెట్ ఇవ్వని పక్షంలో ఆయన, ఆయన అనుచరులు వైసీపీలోకి వెళ్లె అవకాశం ఉన్నదని చంద్రబాబు నాయుడు భావించారు. భూమా ఎలాగూ టీడీపీలో ఉన్నాడు కనుక ఇప్పటికే ఆయన జగన్ మోహన్ రెడ్డిని దూషిస్తూ తీవ్రంగా మాట్లాడంతో తిరిగి వైసీపీలోకి అవకాశం లేదు గనుక శిల్పాకు టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. శిల్పాకి టికెట్ ప్రకటించిన వెంటనే భూమా తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేస్తూ పార్టీ మారేటప్పుడు ఇచ్చిన ఏ ఒక్కహామి నెరవేరలేదని, శిల్పాని ఓడిస్తానని కర్నూల్ ఇంచార్జి మంత్రి అచ్చెనాయుడుకి చెప్పారు. విషయం తెలుసుకొన్న ముఖ్యమంత్రి భుమాని పిలిపించి శిల్పాని గెలిపిస్తేనే మంత్రి భూమాకు మంత్రి పదవి ఇవ్వగలనని చెప్పారు.

కొద్ది రోజులు గడచిన తర్వాత చంద్రబాబు వర్గం ఫిరాయింపు దారులచేత మంత్రులుగా ప్రమాణం చేయించడానికి గవర్నర్ ఒప్పుకోవటంలేదనే పుకారు పుట్టించారు. దాంతో తీవ్ర ఆగ్రహం చెందిన భూమా ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీయడంతో బాబుకూడా అది నిజమేనని చెప్పారు. అదే నిజమైతే రాజీనామా చేసి మళ్ళీ గెలుస్తానని దానితో ఎవరికీ వేలెత్తి చూపే అవకాశం ఉండదని భూమా చంద్రబాబుకి చెప్పారు. నంద్యాలలో ఎంఎల్ఏ గా మళ్ళీ గెలవటం కష్టమని, జిల్లాలో నీ మీద తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు నాయుడు ఒకనివేదికను భూమా ముందు పెట్టారు. ఈ నేపధ్యంలో అఖిల ప్రియను మంత్రివర్గంలోకి తీసుకొంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి భూమాని శాంతపరిచారు.

కడపలో భూమా బంధువు ఎంవీ రమణారెడ్డి వర్గాన్ని ఎలాగయినా టీడీపీకి అనుకూలంగా మార్చాలని ఒకవైపు, మరోవైపు ఎంఎల్ సీ ఎన్నికల బాధ్యత  మీదపడటంతో భూమా మీద తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇలా ఒకదానిమీద ఒకటి మీద పడడంతో తీవ్ర ఒత్తిడికి లోనై భూమా కేర్ ఆసుపత్రిలో చేరారు. వారంరోజుల నుండి కేర్ ఆసుపత్రిలోనే ఇన్ పేషెంట్ గా ఉంటూ చికిత్స పొందారు. చికిత్స పొందుతున్న సమయంలో కూడా తక్షణమే నియోజకవర్గానికి రావాలంటూ పార్టీ నాయకుడు ఒత్తిడి చేశాడు.

శిల్పా గెలుపు భూమాకి ఇష్టంలేదనీ, అందుకే అనారోగ్యం పేరుతో ఆసుపత్రిలో ఉంటూ జిల్లాలో ఉన్న తన అనుచరులకు శిల్పాని ఓడించాలని ఆదేశాలు జారీచేస్తున్నాడనీ లోకేష్, చంద్రబాబు నాయుడు అభిప్రాయపడి జిల్లా ఇంచార్జి మంత్రి అచ్చెన్నాయుడన్ని పిలిపించుకున్నారు. భూమా అనుచరులను ఉన్నవారిని నయానో, భయానో ఒప్పించి విజయవాడకి తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నేపధ్యంలో 12 మంది ఎంపీటీసీలు, 9 మంది కౌన్సిలర్లని అచ్చెన్నాయుడు శనివారం భూమాకి తెలియకుండా విజయవాడకి తరలించారు.

విషయం తెలుసుకున్న భూమా డాక్టర్లు, చిన్న కూతురు మౌనిక ఎంత వారిస్తున్నా వినకుండా హుటాహుటిన విజయవాడకి బయలుదేరి వెళ్లారు. విజయవాడలో తన అనుచరుల ఆచూకి తెలియకపోవడంతో అచ్చెన్నాయుడి మీద ఆగ్రహం ప్రదర్శించారు. అప్పటికే తన వద్దకు చేరుకొన్న మిగతా అనుచరులతో భూమా నేరుగా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లారు.

ముఖ్యమంత్రి సమావేశంలో ఉన్నారని ఇప్పుడు కలవటం కుదరదని చేప్పడంతో సాయంత్రం 4 గంటల వరకు భూమా తన అనుచరులతో నిరీక్షించారు. చంద్రబాబుని నిలదీద్దామని లోపలికి వెళ్ళన భూమాకి బాబు తిరిగి తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికలని పట్టించుకోకుండా కుట్ర పన్నుతున్నావని ఆరోపణలు చేయటంతో భూమా నిర్ఘాంత పోయినట్లు సమాచారం. కొద్ది సేపట్లో తేరుకున్న భూమా చంద్రబాబు ఆరోపణలని కొట్టిపడేస్తూ ఎంఎల్సీని గెలిపించే బాధ్యత తనదేనని, అదేవిధంగా మంత్రిపదవి తనకు ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టారు.

దీంతో మరోసారి బాబు గవర్నర్ వద్దంటున్నారనీ, నంద్యాలలో తిరిగి పోటీ చేస్తే గెలవలేవనీ, ఇప్పుడు ఎన్నికలకి వెళ్లే ఉద్దేశ్యం తనకి లేదని కాబట్టి మంత్రి పదవిమీద పట్టుబట్టకుండా ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ తీసుకోవాలని అంతకుమించి ఏమీ చేయలేనని చంద్రబాబు భూమాకి తేల్చి చెప్పినట్లు సమాచారం .

దానితో తీవ్రమనస్తాపం చెందిన భూమా అన్నివిధాలుగా మోసపోయానని గ్రహించుకొని తన కుటుంబం అనేక కష్టాలలో ఉందని దయచేసి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఆఖరికి తన వర్గాన్ని కాపాడుకోవటం కూడా కష్టంగా ఉందని భూమా తన ఆవేదనను చంద్రబాబుకి విన్నవించారు. గవర్నర్ నిర్ణయమే నిజం అయితే ఎంఎల్సీ ఫలితాలు రాగానే అదే రోజు నంద్యాలకు రాజీనామా చేస్తానని, మళ్ళీ గెలిచిన తర్వాతే మంత్రి పదవి తనకు ఇవ్వమని చెప్పి అక్కడ నుండి ఆళ్లగడ్డ బయలుదేరినట్లు సమాచారం.

విజయవాడ నుండి అర్థరాత్రి సమయంలో ఆళ్లగడ్డ చేరుకొన్న భూమా తన అనుచరులతో కూడా ఏమీ మాట్లాడకుండా అందరినీ ఇంటికి పంపేసినట్లు సమాచారం. ఆ రాత్రి అంతా నిద్రపోకుండా రెండో కూతురు మౌనికతో చాలాసేపు మాట్లాడుతూ మనం పూర్తిగా మోసపోయామని ఆవేదన చెందినట్లు సమాచారం. ఉదయం కూతురు నిద్రలేవగానే మళ్ళీ రాత్రి విషయాలనే ప్రస్తావిస్తూ అమ్మతో పాటే మన వెలుగు పోయిందని భూమా ఆవేదన చెందారని సమాచారం. ఆ తరువాత కొద్దిసేపటికే మూర్ఛలు రావటం, వెనువెంటనే ఆళ్లగడ్డలో ఉన్న ఆసుపత్రికి తరలించటం అక్కడే గుండెపోటు రావటంతో, మెరుగైన చికిత్సకోసం నంద్యాలోని ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం భూమా నాగిరెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.