‘చంద్రబాబు’ గురించి జగన్‌కి కెటిఆర్ చెప్పిన సీక్రెట్ ఏంటి?

What is the secret KTR told to Jagan about AP CM Chandrababu Naidu

 

What is the secret KTR told to Jagan about AP CM Chandrababu Naidu

వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఓ మహా నాయకుడి కుమారుడు. ప్రస్తుతం ఓ పార్టీకి అధ్యక్షుడు అందునా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు ఆయన. అసెంబ్లీ సమావేశాల్లో ఏదైనా విషయానికి సంబంధించి చర్చ మొదలై ఆయన మాట్లాడటం మొదలుపెట్టిన వెంటనే అధికారపక్ష సభ్యులు అడ్డుపడుతూనే ఆయనను మాట్లాడనీయకుండా మధ్య మధ్యలో మైక్ కట్ చేసేలా చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మొదలైనప్పటి నుండీ ప్రతిపక్ష నేత హోదాలో ఏదైనా అంశంపై చర్చలో పాల్గొనడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలేచి నిలబడి మాట్లాడడం మొదలైన కొద్దిసేపటికే అడ్డుపుల్లలు వేయడం ప్రారంభం అవుతుంది. రెగ్యులర్‌గా గత మూడేళ్ళుగా అసెంబ్లీలో ప్రతీ ఒక్కరూ చూస్తున్న సీన్ ఇదే.

సబ్జెక్ట్ ఏదైనాసరే అధికారపక్ష సభ్యులు ఆఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం జగన్‌ను టార్గెట్ చేసుకొని మాట్లాడాలంటే ఎత్తుకొనే అంశాలు రెండు. ఒకటి జగన్ చదువుకు సంబంధించింది. రెండోది ఆయన అక్రమాస్తుల కేసుకు సంబంధించి. అయితే జగన్ చదువుకు సంబంధించి అధికారపక్షం మొత్తం ఏకమై వ్యంగ్యాస్త్రాలు సంధించడం కామనై పోయింది. దానికి ఎప్పటికప్పుడు జగన్‌కూడా గట్టిగా చురకలేస్తూ జవాబులివ్వడం జరుగుతూ ఉంది. అందులోనూ జగన్‌కూడా ఎవరికీ తక్కు కాదనట్టుగా వాళ్ళని ఎగలేపినట్లు తన దగ్గరికి వస్తే ఇంగ్లీష్ నేర్పిస్తాననడం, దానికి వాళ్ళు ఘాటుగా స్పందించడం ఇప్పటి వరకు చూశాం.

అయితే లేటెస్ట్‌‌గా ఈరోజు పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్‌ ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో కావాలనే సాక్షి విలేఖరిని, పేపర్‌ను వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. అంతేగాక చంద్రబాబు తన ప్రసంగంలో జగన్‌ ఏ స్కూల్ నుండి వచ్చారో ఏ కాలేజీ నుండి వచ్చారో చెప్పరని, అదొక సీక్రెట్ అని అన్నారు. దానికి వైఎస్ జగన్ ఘాటుగానే స్పందించారు. చంద్రబాబులాగా వచ్చీరాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుండి కాదు తాము వచ్చిందనీ, హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న తాను 10క్లాస్‌ , ఇంటర్, డిగ్రీల్లో ఫస్ట్‌క్లాస్ స్టూడెంట్ అనీ పోయి తెలుసుకోండి అని చంద్రబాబుకు చురకలంటించారు జగన్. అంతేగాక మీ మాదిరిగా పిహెచ్‌డి డిస్‌కంటిన్యూ కాదు నేను.. మీమాదిరిగా ఎంఫిల్ చదవకపోయినా ఎంఫిల్ చదివానని చెప్పే గుణంలేదని విమర్శించారు జగన్.

అక్కడితో ఊరుకోకుండా ‘నీ మాదిరిగా ఎక్కడైనా నువ్వు పోయి మాట్లాడావంటే అదీ వచ్చిరానీ ఇంగ్లీషు… నీ మాటలు చూస్తే నీలాంటోడు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంత దారుణమైన ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఉంటారని చెప్పి పక్కన కెటిఆర్‌గారు అన్నారు. తెలుసుకోవయ్యా నీ ఇంగ్లీష్ గురించి బయట ప్రపంచం ఏమంటా ఉందో… ఊరికే మాట్లాడమంటే మాట్లాడుతారు… ‘ అంటూ జగన్ చంద్రబాబుని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు.

మొత్తానికి వీళ్ళిద్దరి వాదోపవాదాలతో ఎపి అసెంబ్లీలో తెలంగాణా ఐటీశాఖామంత్రి కెటిఆర్ గురించి ప్రస్తావన వచ్చింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.