యోగి ఆదిత్యనాథ్ కంటనీరు పెట్టిన వేళ

when in 2007 yogi adityanath cried in parliament

నాటి కాంగ్రేస్ ప్రభుత్వం ఒక యోగిని, సాధుస్వభావిని తప్పుడు కేసుల్లో ఇరికించి మార్చి 12 , 2007న  నిండు లోక్ సభలో కన్నీళ్ళు పెట్టించింది. ఆయన ధర్మాగ్రహంతో నేరుగా స్పీకర్ ను అడిగారు “అయ్యా ఇది నేను 3 వసారి ఎన్నికయ్యాను. మొదటిసారి ఎన్నికయినప్పుడు నా వయసు కేవలం 26 సంవత్సరాలు. గోరఖ్ పూర్ స్థానిక ఇస్లామిక్ మాఫియా గ్యాంగులు నేను అడ్డు వస్తాననే ఉద్దేశ్యంతో నా అనుచర సాధుగణం మీద అత్యాచారాలు చేయించి, వారిని బౌతికంగా హింసిస్తుంది. నన్ను తీవ్రమైన ఆరోపణలతో మానసికంగా బలహీనుడిగా చేసే కుట్రలు చేస్తున్నది. నేను నా మఠం కోసం ప్రజల్లోకి వచ్చాను. నా ధర్మం కోసం ప్రజల్లోకి వచ్చాను. నా దేశం కోసం ప్రజల్లోకి వచ్చాను. నా కుటుంబాన్నీ, నాజీవితాన్ని ఈ దేశంకోసం, నా ధర్మం కోసం త్యాగం చేయడం నా నేరమా?“

“ఇదిగో చెప్తున్నాను వినండి స్పీకర్ సర్, ఏ నేలనుంచీ నన్ను దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో. ఆ నేలనే, ఆ భూమి తల్లినే నా కార్యస్థలిగా చేసుకుంటాను. నన్నెవరూ ఆపలేరు. ఇకనుంచీ మీరొక కొత్త యోగి ఆదిత్యనాధ్ ను చూస్తారు“ అంటూ ఆగ్రహం ఉద్వేగమై గొంతు గాద్గికమై కన్నీరు కళ్ళలో నుండి చెంపల మీదుగా కారుతుండగా ఒక కర్మయోగి చేసిన ప్రతిజ్ఞ అది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.