‘భూమా’ రాజకీయ వారసులు ఎవరు?

Who is MLA Bhuma Nagi Reddy Political Successor in Nandyal By poll

Who is MLA Bhuma Nagi Reddy Political Successor in Nandyal By poll

 

నంద్యాల రాజకీయాలు ఎవరి అంచనాలకు అందేటట్లు కనిపించట్లేదు. ఎప్పటికప్పుడు సమీకరణాలు మారుతుండడంతో భూమా నాగిరెడ్డి వారసుడిగా ఎవరు బరిలో ఉండబోతారన్నదానిపై చర్చ జరగుతోంది. ముఖ్యంగా ఇటీవల మృతి చెందిన నంద్యాల భూమా నాగిరెడ్డి వారసుడిగా ఆయన అన్న కుమారుడు బ్రహ్మానందరెడ్డి పేరు వినిపిస్తుంది. వాస్తవానికి బ్రహ్మానందరెడ్డి తండ్రి శేఖర్ రెడ్డి భూమా కుటుంబంలో నాయకత్వం వహించేవారు.

1991లో ఆయన ఆకస్మికంగా మృతి చెందటంతో భూమానాగిరెడ్డి ఆయన స్థానంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నాగిరెడ్డి మృతితో భూమా కుటుంబం ప్రాబల్యం కొనసాగాలంటే బ్రహ్మానందరెడ్డికే తెలుగుదేశం పార్టీ అభ్యర్దిత్వం ఇవ్వాలని భూమా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనిక మాత్రం తన తండ్రి వారసత్వం తనకే రావాలని తానే ఎమ్మెల్యే గా పోటీ చేస్తానని గట్టి పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం మౌనిక భర్త, అత్తమామలతో పాటు బెంగళూరులో ఉంటున్నారు. వాళ్ళు కూడా మౌనికను రాజకీయాల్లో దింపాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారట.

అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు తెలుగుదేశంపార్టీ అగ్రనాయకులు సైతం బ్రహ్మానందరెడ్డి అభ్యర్దిత్వం వైపే మొగ్గుచూపుతున్నారని సమాచారం. అంతేగాక అఖిలప్రియను మంత్రివర్గంలోకి తీసుకుని బ్రహ్మానందరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని తెలుగుదేశం అధిష్టానం ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.