తప్పు ఎవరిది…?

Who is responsible for the Suicide like sirisha happening in society

మూడు రోజులుగా సంచలనానికి తెరలేపిన బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతిని ఆత్మహత్యగా తేల్చి చెప్పారు పోలీసులు. ఒక అవైవాహిక సంబంధం తెచ్చిన తంటా ఇప్పుడు రెండు ప్రాణాలను బలితీసుకొని పెద్ద దుమారానికే తెరలేపింది. సమాజంలో ఇలాంటి ఎన్నో రకాల అనైతిక సంబంధాలు, ఆలోచనలు వెలుగులోకి వచ్చినప్పుడు బాధపడి మన సమాజం ఎటు వైపుకెళ్తోంది అనుకోవడం, తిట్టుకోవడం తప్ప మన చేయగలిగిందేమీ లేదు. శిరీష ఆత్మహత్య విషయంలోనూ అసలు తప్పెవరిది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు హల్‌చల్ చేస్తున్నాయి.

Who is responsible for the Suicide like sirisha happening in society

 

తప్పు ఎవరిది???

భర్త, ఎదుగుతున్న బిడ్డ ఉండగా వాళ్ళను ఒదిలి నువ్వే కావాలనుకుంటూ…రాజీవ్ వెంట పడి రంగుల లోకంలో తిరిగి, తనువు చాలించిన శిరీషదా.?

అప్పటికే శిరీషతో సంబంధం కొనసాగించుకుంటూ…మధ్యలో తేజస్వినితో మరిగి ఆమెనే పెండ్లి చేసుకుంటానని శిరీషతో గొడవపెట్టుకున్న రాజీవ్‌దా.?

ఏదో సాయం చేయమని అడిగినందుకు వీళ్ళ గొడవలను అడ్డం పెట్టుకొని ఎస్సై ప్రభాకర్‌రెడ్డికి శిరీషను తార్చే ప్రయత్నం చేసిన శ్రావణ్‌దా.?

ధైర్యంగా ప్రజలకు రక్షణ కోసం నిలబడకుండా, ఒక ఎస్సైగా బాధ్యతాయుతమైన పోస్టులో వుండి.. తనకు సంబంధం లేని కేసులో తెల్లవారేదాక తాగుతూ అమ్మాయి మోజులో పడి , చివరికి భయపడి ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్‌రెడ్డిదా.?

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మార్చి నేరప్రవృత్తిని పెంచి పోషిస్తున్న అసంబద్థ సామాజిక విలువలదా.?

తప్పు ఎవరిది.?

అసలు తప్పు ఎవరిది??

Have something to add? Share it in the comments

Your email address will not be published.