సావిత్రి పాత్ర పోషించేది ఎవరు?

గత కొన్ని నెలలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్‌కోసం వెతికిన సినిమా ప్రాజెక్ట్ సావిత్రి. ఈ సినిమా కోసం చాలా రోజులపాటు హీరోయిన్ కోసం వెతికారు. ఈ సినిమాకోసం నిత్యామీనన్‌, విద్యా బాలన్‌, సమంత, కీర్తి సురేష్ ఇలా ఎందరి పేర్లో పరిశీలనకు వచ్చాయి.  ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ వంటి క్లాస్‌ సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మహానటి సావిత్రి బయోపిక్‌  ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘సావిత్రి’. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదలచేసింది చిత్ర యూనిట్.

చాలా రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఇంతవరకు నటీనటులతో పాటు ఇతర వివరాలేవి వెల్లడించలేదు. ముఖ్యంగా సావిత్రి పాత్రలో ఎవరు కనిపించబోతున్నారన్న పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చను మరింత ముందుకు తీసుకెళ్ళాడు నాగ అశ్విన్. మాయ బజార్ సినిమాలోని సావిత్రి స్టిల్, వెనుక ఒకవైపు కీర్తి సురేష్, మరోవైపు సమంత ఫోటోలను యాడ్ చేశారు. అయితే ఈ ఇద్దరిలో సావిత్రిగా ఎవరు కనిపించబోతున్నారన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అదే సమయంలో ఈ చరిత్రలో భాగమయ్యేందుకు మీరు ముందుకు రండి అంటూ కాస్టింగ్ కాల్ కూడా ఇచ్చారు. ‘తరాలను నిర్మించే స్త్రీ జాతికోసం, తరతరాలు గర్వించే మహానటి సావిత్రి కథ’ అనే లైన్‌‌తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో టైటిల్‌ను మాత్రం రివీల్ చేయలేదు.

మరోవైపు ఎన్టీఆర్ మనవడు తారక్, ఏఎన్నార్ మనవడు నాగ చైతన్య కలసి ఇప్పుడు  సావిత్రిలో నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో ఇద్దరూ కలసి నాటి క్లాసిక్ ‘గుండమ్మకథ’ను రీమేక్ చేద్దామనుకున్నా, ఎందుకనో అది పట్టాలెక్కలేదు. ఈ క్రమంలో సావిత్రి జీవిత కథతో తెరకెక్కే ‘మహానటి’ సినిమాలో వీరిద్దరూ నటించనున్నారట. ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో సావిత్రికి ఎంతో అనుబంధం వుంది. దాంతో కొన్ని సన్నివేశాలలో వీరు కనిపిస్తారట. అందుకే, ‘మహానటి’ చిత్ర దర్శకుడు నాగ్ అన్వేశ్ ఇటీవల ఎన్టీఆర్, చైతూలను కలసి, తమ తాతల పాత్రలను పోషించమని కోరినట్టు, అందుకు వీరు అంగీకరించినట్టు చెబుతున్నారు. అనుకున్నట్టుగా వీరిద్దరూ ఆ పాత్రలను పోషిస్తే కనుక ఈ చిత్రానికి మంచి హైప్ వస్తుందని అనుకుంటోంది టీం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.