కెటిఆర్‌కు వర్షం అంటే భయమెందుకు??

Why is KTR so scared of rains in Twin Cities

Why is KTR so scared of rains in Twin Cities

తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర పురపాలక శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టి హైదరాబాద్‌పై ప్రత్యేక ద‌ష్టిపెట్టిన మంత్రి కెటిఆర్. సీఎం కేసీఆర్ తర్వాత అంత ప్రాధాన్యత ఉన్న కెటిఆర్‌కు వర్షం అంటే భయమని చెబుతున్నారు. వర్షాకాలం వస్తోందంటేనే చాలు కెటిఆర్‌కు కొత్త భయం పట్టేసుకుంది. అదేంటంటే ప్రతీ యేడాది వర్షాకాలం వచ్చిందంటే చాలు నాలు చినుకులు పడితే భాగ్యనగరం భాగ్యమంతా బయటపడిపోతోంది.

నాలుగు చినుకులు కురిస్తేనే ఎక్కడికక్కడ నీళ్ళు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఎదురవడమేకాకుండా ప్రజలు అనేక ఇబ్బందులకు గురౌతుంటారు. అలాంటి పరిస్థితి ఏర్పడ్డ ప్రతీసారి ప్రతీఒక్కరు జీహెచ్‌ఎంసీ వాళ్ళతోపాటు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం కామనైపోయింది. అందుకే హైదరాబాద్ నగరంలో వర్షాలు పడకపోయినా పర్వాలేదని, వర్షం పడితే మాత్రం ఎక్కడికక్కడ నీరు నిలిచే ప్రమాదం పొంచి ఉందని కెటిఆర్ చెబుతున్నారు.

మురుగునీటికి శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా 70 మినీ జెట్టింగ్ మిషన్లను డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో కలిసి ప్రారంభించారు. ఇరుకు వీధుల్లోకి భారీ ఎయిర్ టెక్ మిషన్లు వెళ్లని చోటుకు కూడా ఈ యంత్రాలు నేరుగా చొచ్చుకు వెళ్లి ఆయా సమస్యకు పరిష్కారం చూపనుండడంతో వీటికి ప్రాధాన్యత పెరిగింది. సుమారు 5వేల కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన మురుగునీటి పారుదల వ్యవస్థలో రోజు వారీగా మురుగు ప్రవాహానికి ఆటంకం లేకుండా సాఫీగా వెళ్లేందుకుగానూ పూడికతీత పనులు పకడ్భందీగా చేపట్టనున్నట్లు తెలిపారు కెటిఆర్.

ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉప్పొంగుతున్న మ్యాన్‌హోళ్లు, తరచూ మురుగు నీటి సమస్యలు తలెత్తే 600 హాట్‌స్పాట్స్ (సమస్యాత్మక ప్రాంతాల)ను గుర్తించిన అధికారులు ఈ ప్రాంతాల్లో మానవరహిత మురుగు నీటి శుద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. మ్యాన్‌హోల్స్‌ను మాన్యువల్‌గా శుభ్రం చేయడాన్ని ఇక మీదట పూర్తిగా ఆపేస్తామని, దానికి బదులు ఈ మిషన్ల ద్వారా శుభ్రం చేయిస్తామని అన్నారు. సివరేజి వ్యవస్థ మొత్తం మారాలంటే రూ. 11 వేల కోట్లు అవసరం అవుతాయని ఆయన చెప్పారు. త్వరలోనే వర్షాలు రాబోతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు.

ఈ సందర్భంగా జెట్టింగ్ వాహనాల సిబ్బందికి బ్యాక్టీరియా ఫ్రీడ్రెస్‌లు అందజేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.