తెలంగాణాలో ‘కమలనాథులు’ ఏం చేస్తున్నారో తెలుసా??

Will BJP’s operation Akarsh work in Telangana?
Will BJP’s operation Akarsh work in Telangana?
ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసిన బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ విజయాల తర్వాత ఇప్పుడు బిజెపి దక్షిణాదిలో అడుగులు వేయడానికి రెడీ అవుతోంది. విజయాత్ర కొనసాగించడానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏకంగా రంగంలోకి దిగారు. అందులో భాగంగా తెలంగాణాలో ఇప్పటి వరకు తెలుగుదేశం, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు మాత్రమే అమలు చేసిన ఆపరేషన్ ఆకర్ష్ పథకాన్ని అమలు చేయాలని బిజెపి భావిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో బలపడడానికి ఇతర పార్టీల్లో గెలిచే అవకాశమున్న నేతలను తమవైపు తిప్పుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర నేతలతో సంబంధం లేకుండా ఆపరేషన్ అమలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తుండడంతో మిగతా పార్టీ నేతలే.. విస్తుపోతున్నారు. అంత సీక్రేట్‌గా ఆపరేషన్ ఆకర్ష్ ఎందుకు చేస్తున్నారు??

దేశంలో 17 రాష్ట్రాలతోపాటు, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దక్షిణాదిన విజయఢంకా మోగించడానికి పావులు కదపడం ప్రారంభించింది. దానికోసం తెలంగాణాపై కమల దళపతి అమిత్ షా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. అందులోభాగంగా ఇప్పటినుండి ప్రతీనెల తెలంగాణాలో పర్యటించి పార్టీని పటిష్టం చేయడానికి ముమ్మర ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కేవలం బిజెపిని బలోపేతం చేయడంతోపాటు… ఇతర పార్టీలను వీక్ చేయడానికి కూడా ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకున్నారు కమలనాథులు.

కాంగ్రెస్‌లో వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలున్న నాయకులను టార్గెట్ చేసి వాళ్ళందరికీ కాషాయ కండువా కప్పడానికి డిసైడ్ అయ్యారట. అందులో భాగంగా రాష్ట్ర బిజెపి నాయకులను రంగంలోకి దించకుండా బిజెపికి అనుకూలంగా ఉండే సానుభూతిపరులతో కండువా కప్పుకొనేలా ఒత్తిడి తెస్తున్నారట. అంతేగాకుండా రాబోయే ఎన్నికల్లో బిజెపిదే అధికారం అని చెప్పి ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారంట. అదికూడా వర్కౌట్ అవ్వకపోతే ఆ కాంగ్రెస్ నాయకులు ఉన్న ప్రాంతంలో ఉన్న బాబాలు, గురువులతో భవిష్యత్తులో బిజెపిలో చేరితే మంచిరోజులు ఉన్నయని చెప్తున్నారంట. ఆ వత్తడికి ఆ కాంగ్రేస్ నేత అంగీకరించకపోతే…. భవిష్యత్తు మీదే కేంద్రంలో మళ్లీ అధికారంలోకి బిజేపినే అనే మాటలు చెబుతున్నారట.

లేటెస్ట్‌గా ఇలాంటి అనుభవమే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ యువ ఎమ్మెల్యేకు జరగడంతో ఆయన ఆశ్చర్యపోయాట. యూత్ కాంగ్రెస్ నుండి పార్టీలో ఎదిగిన నాయకుడిని అని తెలిసి కూడా బిజెపి ఇలాంటి ప్రయోగాలు చేస్తోందని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట ఆ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ భావజాలంతో నాయకుడిగా ఎదిగిన తనకే ఇలాంటి ఒత్తిడి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీనేతలను ఏవిధంగా కమలనాథులు టార్గెట్ చేస్తున్నరో అర్థం చేసుకోవచ్చని సన్నిహితులతో చర్చించుకుంటున్నారు ఆ యువ ఎమ్మెల్యే.

కానీ ఈ ఆపరేషన్ కేవలం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీనే టార్గెట్‌గా బిజెపి చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బలపడితే.. ప్రమాదమని భావిస్తున్న కమలం పార్టీ…. కాంగ్రెస్ నేతలకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. సొంతపార్టీ రాష్ట్రనేతలకు తెలియకుండా, జాతీయ నాయకులు చేస్తున్న ఆకర్ష పథకం ఏమేరకు ఫలిస్తోందో చూడాలి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.