శ్రీవాస్ ప్రపోజల్ కి కీర్తి ఓకే చెబుతుందా

సినిమా సక్సెస్ అయితే మరికొన్ని పిక్చర్స్ వస్తాయి. రెండు సినిమాలు హిట్ అయితే చాలు — ఈ రోజుల్లో హీరో అయినా, హీరోయిన్ అయినా నిలదొక్కుకున్నట్టే. పైగా ఇప్పటి నటీనటులకు ఎడ్వాంటేజ్ ఏంటంటే టాలీవుడ్ లో సక్సెస్ అయితే కోలీవుడ్ రెడ్ కార్పెట్ పరుస్తుంది. అలా దూసుకుపోతున్నారు. కీర్తి సురేష్ పని ఇప్పుడు అలాగే ఉంది.

కొందరికి లక్ లక్క లా ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు కీర్తి సురేష్ ఫుల్ స్వింగ్ లో ఉంది. తమిళంలో వరుస సినిమాలతో కీర్తి సురేష్ దూసుకుపోతోంది. అక్కడి స్టార్ హీరోస్ తో నటించే ఛాన్సులు ఆమెకు వస్తున్నాయి. వారికి పెయిర్ గా ఆమెను తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. తెలుగులో ఆమె చేసిన ‘నేను శైలజ’ .. ‘నేను లోకల్’ సినిమాలు ఘన విజయాలను సాధించడం కీర్తికి కలిసొచ్చింది.

మొదట మలయాళ సినిమాలు చేసింది కీర్తి. పైలట్, కుబేరన్, గీతాంజలి, రింగ్ మాస్టర్ వంటి సినిమాలు చేసిన తర్వాత టాలీవుడ్ లో కి ఎంటరై నేను శైలజ తో హిట్ కొట్టింది. అంతే. కీర్తి కీర్తి బావుటా ఎగిరింది. అందుకే కోలీవుడ్ లో వరస ఆఫర్లు వస్తున్నాయి. చేసిన సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. తమిళంలో నటించిన రెమో, తొడరి, బైరవ, రజని మురుగన్ హిట్టయ్యాయి. దాంతో కోలీవుడ్ లో కూడా ఆమె అభిమానుల సంఖ్య పెరిగిపోయింది. నేను శైలజ తర్వాత కోలీవుడ్ కు వెళ్లిన కీర్తి అక్కడ బిజీ కావడంతో తెలుగు సినిమాలు చేయలేదు. అయితే నేను లోకల్ పిక్చర్ హిట్ కావడం కీర్తికి మరో లక్. ఇప్పుడు తెలుగు నిర్మాతలు, దర్శకులు ఆమె వెంటపడుతున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓ పిక్చర్ తీయాలనుకుంటున్న దర్శకుడు శ్రీవాస్ ఆమెను సంప్రదిస్తున్నాడట. మరి ఈ సినిమా చేయడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.