మోడీ మంత్రాంగం ఫలించేనా? దోస్తీ ఎవరితో?

Will Modi stratergy succeed? Who is the Friend and Who is Foe in AP ?

Will Modi stratergy succeed? Who is the Friend and Who is Foe in AP ?

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోకున్నాయి. ఇన్నేళ్ళు తెలుగుదేశం పార్టీతో చెట్టపట్టాలేసుకొని తిరిగిన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని పెంచుకొనేందుకు ప్రతిపక్ష నాయకుల బలహీనతలను టార్గెట్ చేసి వాళ్ళతో దోస్తీని మొదలుపెట్టేలా పావులు కదుపుతోంది.  ఎన్నో ఏళ్ళుగా ఎన్‌డిఎలో భాగస్వామిగా ఊంటూ జాతీయస్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబుతో ఉన్న దోస్తీకి కటీఫ్ చెప్పాలని కమలనాథులు అనుకుంటున్నారా?? అంటే ఢిల్లీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఒకవైపు, వైసీపీ నాయకుల్లో కనిపిస్తున్న కొత్త ఉత్సాహానికి బలం చేకూరేలా బిజెపి రాష్ట్ర నాయకుల ప్రకటనలు చూస్తుంటే ఇలాంటి డౌట్స్ రావడం కామనే.

ఇన్నేళ్ళు బీజేపీకి చంద్రబాబు అత్యంత నమ్మకమైన మిత్రుడు. అయితే చంద్రబాబు దేశంలోలేని సమయంలో , అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు గతేడాదిగా దొరకని అపాయింట్‌మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేతకి దొరకడం, అందులోనై వీళ్ళు అడగకుండానే వాళ్ళకి వాళ్ళే పిలిపించుకొని మాట్లాడడంతో సీరియస్‌నెస్ మరింత పెరిగింది. దీంతో త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సమీకరణలు మారబోతున్నాయనే సంకేతాలు అధికారపార్టీ నాయకులకు నిద్రలేకుండా చేస్తోంది.

అంతేగాక దక్షిణాదిలో బిజెపిని బలోపేతం చేసేందుకు తెగ తాపత్రయ పడుతున్న అమిత్‌షా బృందం దానికి తగ్గట్లుగానే పావులు కదుపుతున్నారు. అందులోభాగంగానే ఎపి సీఎం, ఎపికి చెందిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇద్దరూ దేశంలోలేని సమయంలోనే జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చి దగ్గరికి తీసుకొనే ప్రయత్నం చేశారు.

టీడీపీతో ఇన్నేళ్ళు ఉన్న దోస్తీని తెగతెంపుకొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చారనే గుసగుసలు కమలనాథుల దగ్నగర వినిపిస్తున్నాయి. అంతేగాక ఏపిలో రాజధాని నిర్మాణంలో భాగంగా అవినీతి చాలా పెరిగిపోయిందని, చంద్రబాబు సర్కారుపై ఆరోపణలు సైతం పెద్ద ఎత్తున వినిపిస్తుండడంతో వాళ్ళతో దోస్తీ కంటే దూరం ఉండడమే మేలు అనే భావనలో ఉన్నారు కమలనాథులు. పొత్తుల విషయంలో ఎన్నికల సమయంలో కాకుండా ఈసారి ముందే చేసుకుంటే బెటరని భావిస్తున్నారు.

కాంగ్రెస్ హయాంలో జాతీయస్థాయిలో చక్రం తిప్పిన నాయకులు ఇప్పటికే బిజెపిలో ఉన్నప్పటికీ దక్షిణాదిన ఎంతో కీలకమైన ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఇప్పటికీ పట్టు దొరకట్లేదు. టిడిపితో ఎలాగైనా తెగదెంపులు చేసుకున్న తర్వాత చంద్రబాబు అవినీతి ఆరోపణలపై విచారణ చేయించే ఆలోచనలో ఉన్నారు కమలనాథులు.

మరోవైపు అమెరికా పర్యటన నుండి నేరుగా ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు తనకు అత్యంత దగ్గరి మంత్రి అయిన యనమల రామకృష్ణుడిని సైతం పంపించి ఎవరికీ తెలియకుండా ఆరు గంటలపాటు ఢిల్లీలోనే మకాం వేసి చర్చలు జరిపారనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో దిద్దుబాటు చర్యల దిశగా బాబు అడుగులు వేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.