పాపం 2వేల నోటుకి కష్టకాలం..!

మళ్ళీ మనీ కష్టాలు రానున్నాయా? నవంబర్ 8 తర్వాత జరిగిన పరిణామాలు మళ్ళీ పునరావ‌త్తంకానున్నాయా ? కొత్తగా ప్రవేశపెట్టిన 2వేల నోట్లను రద్దు చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉందా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు ముందుగా నోట్ల రద్దు చేసి కొత్తగా 2వేల రూపాయల నోట్లను చెలామణీలోకి తీసుకొచ్చిన కేంద్రం ఇప్పుడు మళ్ళీ యూ టర్న్ తీసుకొని 2వేల నోట్లను రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏకైక పార్టీగా అవతరించిన బిజెపి ఇప్పుడు మరింత కీలక ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. ఎందుకంటే మూడు నెలల క్రితం మనదేశంలో డబ్బులులేక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నారో సేమ్ టు సేమ్ అలాంటి పరిస్థితి మనదేశంలో ఇప్పుడు నెలకొంది.

దాదాపు 15 రోజుల నుండి దేశంలో ఏ ఎటిఎంలోనూ డబ్బులులేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దాంతో బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఇప్పుడు మనదేశంలోని బ్యాంకుల్లో మళ్ళీ డబ్బులు నిండుకున్నాయి. నోట్ల రద్దు వల్ల ప్రజలు కొత్త నోట్లు వచ్చిన వెంటనే అందరూ మళ్ళీ దొరకవనుకొనేలా ఉన్నవన్నీ ఊడ్చేసి ఇళ్ళకు పట్టుకెళ్ళారు. అంతేగాక బ్యాంకుల్లో దాచిపెట్టుకున్న డిపాజిట్లను అన్నింటినీ క్లోజ్ చేసేసారు. దీనికితోడు ఈ మూడు నెలల్లో ఏమాత్రం డిపాజిట్లు జరగకపోవడంతో బ్యాంకుల్లోనూ విత్‌డ్రాల కోసం డబ్బులు ఇచ్చే పరిస్థితిలేకుండా పోయింది.

ఇప్పటివరకు రిజర్వ్ బ్యాంక్‌ నుండి 40 వేల కోట్ల విలువైన రెండు వేల రూపాయలను  చెస్ట్‌లు బ్యాంకులకు సరఫరా చేస్తే ఇప్పుడు అన్ని బ్యాంకుల వద్దా ఉన్నది అయిదు లేదా పది వేల కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లే మిగిలాయి. నోట్ల రద్దు తర్వాత వచ్చిన 2వేల నోట్లను రాబోయే ఎన్నికలకోసం రాజకీయనాయకులు, అక్రమార్కులు, దళారీలు ఇన్నాళ్ళు బ్యాంకుల్లో ఉంచుకున్న మనీ మొత్తం బయటికి తీసుకొచ్చి బ్లాక్‌మనీని చేసిపారేశారు. దీంతో ఇప్పుడు మళ్ళీ బ్లాక్‌మనీ విషయంలో పాత పరిస్థితే ఏర్పడింది.

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చి బిజెపి అధికారంలోకి వచ్చేయడంతో ఇప్పడు మళ్ళీ బ్లాక్‌మనీపై మోడీ సర్కార్ ద‌ృష్టిపెట్టే ఆలోచనలో ఉంది. అందులో భాగంగా ఈనెల 25న మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశప్రజలను ఉద్దేశించి 2వేల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీకితోడు ఈసారి గతంలో ఇచ్చిన విధంగా 45రోజులపాటు డబ్బులు బ్యాంకుల్లో మార్చుకోవడానికి ఇచ్చిన గడువును వారం రోజులు మాత్రమే ఉంచే ఆలోచనలో ఉంది సర్కార్. అందులోభాగంగానే రిజర్వ్ బ్యాంక్‌నుండి బ్యాంకులకు 2వేల నోట్ల సరఫరా పూర్తిగా ఆగిపోయింది బ్యాంకింగ్ సర్కిళ్ళలో చర్చ పెద్ద ఎత్తున జరగుతోంది.

రెండువేల రూపాయల నోట్లు కూడా ఎక్కువ కాలం చలామణిలో ఉండబోవని  పుణెకు చెందిన అర్థక్రాంతి సంస్థాన్ వ్యవస్థాపకుడు అనిల్ బొకిల్ జనవరిలో హైద్రాబాద్‌కు వచ్చిన సందర్భంగా కామెంట్ చేశారు.

మొత్తానికి మళ్ళీ 2వేల రూపాయల నోట్ల రద్దు, మార్పిడి అనే అంశం మళ్ళీ తెరపైకి వచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను ప్రజలను రోడ్డెక్కించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.