లండన్ లో మహిళా దినోత్సవ వేడుకలు

womens day celebrations in london

womens day celebrations in london

లండన్: అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలను యుక్త ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా నిర్వహించారు. లండన్ లోని వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు ఈ వేడుకల్లో ఆనందంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మిల్టన్ కీన్స్ కౌన్సిలర్ గీత మోర్ల, లాంబెర్త్ మేయర్ కౌన్సిలర్ సాలేహ జఫర్, Dr . పద్మ కిల్లి, ఫస్ట్ సెక్రటరీ హై కమిసన్ అఫ్ ఇండియా అజున్గ్ల జమీర్, ప్రజా ఆరోగ్య డైరెక్టర్ Dr అన్నపూర్ణసేన్  లు పాల్గొని మహిళల గొప్పతనాన్ని కొనియాడారు. సుమారు ౩౦౦ మహిళలు వారి పిల్లలతో సహా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

కార్యక్రమం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన చేనేత దుస్తుల ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. అదే విధంగా ఇందులో చిన్నారుల ఫాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. కార్యక్రమంలో యుక్త కమిటీ సభ్యులు పూర్ణిమ రెడ్డి చల్ల, నరేంద్ర మున్నులూరి, అమర్ రెడ్డి, ఆదిత్య అల్లాడి, ఉదయ్ ఆరేటి, రామ్ మోర్ల, సత్య మద్దసాని, రమ్య, రుద్రవర్మ బట్ట ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో తోడ్పడగా, తెలంగాణ ఎన్ ఆర్ ఐ ఫోరమ్ సభ్యులు జ్యోతి రెడ్డి, వాని, ప్రీతీ, మీనాక్షి అంతటి, గంప వేణుగోపాల్, చంద్ర శేఖర్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.