ప్రముఖ కవి సి.నారాయణరెడ్డి కన్నుమూత

Writer and Poet Jnanpith Awardee C Narayana Reddy passes away

Writer and Poet Jnanpith Awardee C Narayana Reddy passes away

హైదరాబాద్‌: ప్రముఖ తెలుగు కవి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి (85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

1931 జులై 29న కరీంనగర్‌ జిల్లా హనుమాజీపేటలో జన్మించిన సింగిరెడ్డి నారాయణరెడ్డి సినారెగా సాహితీలోకంలో తనదైన ముద్ర వేశారు. నారాయణరెడ్డి మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

డాక్టర్ సి.నారాయణరెడ్డి అంత్యక్రియలు పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ మేరకు ప్రకటించారు. సినారే అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి సీఎస్ ను ఆదేశించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.