త్వరలో నేరాల చక్రవర్తి పుస్తకం: యనమల

Yanamala fires on YS Jagan and corners YSRCP on Capital issue

అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ళలో 3లక్షల 75వేల కోట్ల రూపాయల విలువచేసే కుంభకోణాలు చంద్రబాబు ప్రభుత్వం చేసిందని, అందులో లక్ష కోట్ల కుంభకోణం రాజధాని ప్రాంత భూములపై అయితే మరో లక్ష కోట్లు విశాఖ భూ కుంభకోణం అని ఆరోపిస్తూ వైసీపీ విడుదల చేసిన  అవినీతి చక్రవర్తి పుస్తకంపై ఆర్థికశాఖామంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Yanamala fires on YS Jagan and corners YSRCP on Capital issue

‘నేరాల చక్రవర్తి’పేరిట త్వరలో జగన్‌పై పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు యనమల రామకృష్ణుడు తెలిపారు. జగన్‌ చేసిన నేరాలు, ఘోరాలను సాక్ష్యాలతో సహా సవివరంగా వెల్లడిస్తామన్నారు.అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పుస్తకం అబద్ధాల పుట్ట అని అన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి అధినేత ఉన్న జగన్ ప్రతిపక్ష నేతగా పనికిరారని మంత్రి యనమల అన్నారు.

అంతేగాక కోర్టు కేసులు, దొంగ దీక్షలతో జగన్‌ రాష్ట్రానికి అభివృద్ధి నిరోధకుడిగా మారారని, ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన నాయకుడు జగన్‌ అని యనమల తీవ్రంగా వ్యాఖ్యానించారు. జగన్‌ పార్టీ పెట్టినప్పుడే కన్సల్టెన్సీ పెట్టుకోవాల్సిందని, పార్టీ పెట్టి ఆరేళ్లయ్యాక కన్సల్టెన్సీ పెట్టుకుని ఏం ఉద్ధరిస్తారని మంత్రి అన్నారు. రాజధానిని వ్యతిరేకించి అక్కడే ప్లీనరీ పెడతారా? అని కళా వెంకట్రావ్ ధ్వజమెత్తారు.

See Also: అవినీతి చక్రవర్తి: 56కుంభకోణాలు, 3లక్షల కోట్ల అవినీతి

గుంటూరు, కృష్ణా జిల్లాలో రాజధాని వద్దన్న జగన్ ఇదే ప్రాంతంలో ప్లీనరీ సమావేశాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రశ్నించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్ పార్టీని నడిపిస్తున్నారని.. పేద ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఆయనకు లేదని విమర్శించారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.