కేసీఆర్ బాటలో యోగి ఆదిత్యనాథ్

yogi-adityanaths-ambitious-annapurna-bhojanalya-to-soon-offer-breakfast-for-rs-3-meals-at-rs-5

yogi-adityanaths-ambitious-annapurna-bhojanalya-to-soon-offer-breakfast-for-rs-3-meals-at-rs-5

ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అక్కడి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనాలకు దారితీస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అదొక సంచలనమే. ఇప్పటివరకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలు, అధికారులు ఎవరూ చూడని కొత్త సంస్కరణలతో పరుగులు పెట్టిస్తున్నారు. అందుకే ఇప్పుడు దేశంలో యోగి ఆదిత్యనాథ్ పేరు తెలియనివారుండరు.

అలాంటి యోగి ఆదిత్యనాథ్‌ ఇప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలో పయనిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ రాష్ట్రంలో మొదలుపెట్టిన కొన్ని సంక్షేమ పథకాలు ఇప్పుడు దేశంలో మరొకొన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తయారయ్యాయి. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన ఐదు రూపాయలకే మద్యాహ్న భోజన పథకాన్ని ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రారంభించనున్నారు.

రాష్ట్రంలోని పేద ప్రజల ఆకలిని తీర్చేందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం 5 రూపాయలకే భోజనాన్ని అందించే పథకాన్ని త్వరలో తీసుకురానున్నట్లు ప్రకటించింది. అన్నపూర్ణ భోజనాలయాలు పేరుతో రాష్ట్రమంతటా పేదలకు భోజనాన్ని అందించే పథకాన్ని తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ కార్యాలయ అధికారులు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఉదయం టిఫిన్‌గా పకోడా, పోహ, ఓట్స్‌తో తయారు చేసిన పదార్థాలు, టీ అన్ని కలిపి 3 రూపాయలకే ఇవ్వనున్నారు. మధ్యాహ్నం, రాత్రి వేళలో అన్నం, చపాతీ, కూరగాయల కూర, పప్పు కలిపి 5రూపాయలకే అందిచనున్నట్లు ప్రకటించారు. మరికొన్ని వారాల్లో ఈ అన్నపూర్ణ భోజనాలయాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రంలో దాదాపు 200 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.