ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్

yogi adiyanath to be the new chief minister of utter pradesh

yogi adiyanath to be the new chief minister of utter pradesh

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వంపై ఉత్కంఠ వీడింది. శనివారం సాయంత్రం జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో తమ నేతను ఎన్నుకున్నారు. అత్యధిక స్థానాలతో ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ (44) పేరును ఖరారు చేశారు.

ఉత్తరాఖండ్‌లో జన్మించిన ఆదిత్యనాథ్ ప్రస్తుతం గోరఖ్‌పూర్ స్థానం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన ఇప్పటికి ఐదు సార్లు ఎంపీగా గెలుపొందారు. మొత్తం 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో 324 స్థానాలు బీజేపీ, దాని మిత్రపక్షాలైన చిన్న పార్టీలకు దక్కాయి.

యూపీ ముఖ్యమంత్రి బాధ్యతలను ఎవరికి అప్పగించాలని ముందుగానే పార్టీలో సుదీర్ఘమైన చర్చలు సాగాయి. యూపీ ముఖ్యమంత్రిగా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, మనోజ్ సిన్హాలతో పాటు యోగి ఆదిత్యనాథ్ పేరు కూడా గట్టిగానే వినిపించింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, బీజేపీ నాయకుడు భూపేంద్ర యాదవ్ పరిశీలకులుగా లక్నో వెళ్లారు. అక్కడ ఎమ్మెల్యేలందరితో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు.

అనంతరం శనివారం జరిగిన బీజేపీ శాసననసభాపక్ష సమావేశంలో ఉత్తరప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్ పేరును ఖరారు చేశారు. ఆదివారం మధ్యాహ్నం కొత్త ముఖ్యమంత్రిగా ఆదిత్యనాధ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు కేంద్రమంత్రులు, పార్టీ అగ్రనేతలు, వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.