‘రోగ్‌’లో నా క్యారెక్టర్‌ చాలా డిఫరెంట్‌గా వుంటుంది:యంగ్‌ హీరో ఇషాన్‌

‘రోగ్‌’లో నా క్యారెక్టర్‌ చాలా డిఫరెంట్‌గా వుంటుంది:యంగ్‌ హీరో ఇషాన్‌

 Rogue movie Hero Ishan Interview

పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో తెలుగు, కన్నడ భాషల్లో ఇషాన్‌ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘రోగ్‌’. ట్రైలర్‌లో ఇషాన్‌ పెర్‌ఫార్మెన్స్‌ చూసిన ప్రముఖులు ప్రశంసించిన ‘రోగ్‌’ చిత్రం ఉగాది కానుకగా మార్చి 31న తెలుగు, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ అవుతోంది. యంగ్‌ హీరో ఇషాన్‌ మాట్లాడుతూ…

‘రోగ్‌’తో తెలుగు, కన్నడ భాషల్లో హీరోగా పరిచయమవడం చాలా ఎక్సైటింగ్‌గా వుంది. సేమ్‌ టైమ్‌ నెర్వస్‌గా కూడా వుంది. ‘రోగ్‌’ సినిమాతో నా కెరీర్‌ స్టార్ట్‌ అవుతోంది. రోగ్‌’ ఒక డిఫరెంట్‌ మూవీ. డిఫరెంట్‌గా వుంటూనే ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో సాగే క్యూట్‌ లవ్‌స్టోరీ. కంప్లీట్‌ ప్యాకేజ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌.

నా డ్రీమ్‌ నిజం కాబోతోంది. నేను హీరో అవ్వాలి అనుకున్న తర్వాత ఆ విషయాన్ని అన్నయ్యకి చెప్పాను. అన్నయ్య ఆల్‌రెడీ ప్రొడక్షన్‌లో వున్నారు కాబట్టి నేను చెప్పింది విన్న తర్వాత ఒకే మాట చెప్పారు. నువ్వు టాల్‌గా వున్నావు, లుక్స్‌ బాగున్నాయి. ఓకే. హీరో అవ్వడానికి ఈ క్వాలిఫికేషన్స్‌ ఒక్కటే చాలవు. యాక్టింగ్‌ నేర్చుకోవాలి, హార్డ్‌ వర్క్‌ చెయ్యాలి, డాన్స్‌, ఫైట్స్‌.. ఇలా అన్నీ నేర్చుకోవాలి అని చెప్పారు. తర్వాత ప్రొడక్షన్‌లో నాతో వర్క్‌ చేయించారు.

ఏడాదిన్నర పాటు మా ఓన్‌ బేనర్‌లో చేసిన సినిమాలకు ప్రొడక్షన్‌లో వర్క్‌ చేశాను. అలా నా జర్నీ స్టార్ట్‌ అయింది. రెండు సినిమాలకు పనిచేసిన తర్వాత సత్యానంద్‌గారి దగ్గర కోచింగ్‌ తీసుకోవడానికి వైజాగ్‌ పంపించారు. సత్యానంద్‌గారు నన్ను బాగా ట్రైన్‌ చేశారు. అది పూర్తి కాగానే పూరి సర్‌తో మీటింగ్‌ ఎరేంజ్‌ అవగానే నాకు షాకింగ్‌గానూ, సర్‌ప్రైజింగ్‌గానూ అనిపించింది. నా యాక్టింగ్‌ కోర్స్‌ కంప్లీట్‌ అవ్వగానే నా డ్రీమ్‌ డైరెక్టర్‌ పూరి సర్‌ డైరెక్షన్‌లో సినిమా చెయ్యబోతున్నానని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను.

నేను పూరిగారి డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నానని తెలిసినరోజు నుంచి సర్‌ ప్రతిరోజూ నన్ను గైడ్‌ చేసేవారు. అంత పెద్ద డైరెక్టర్‌ నన్ను ఇంత బాగా చూసుకుంటారని అనుకోలేదు. ఈ కథ గురించి నాకు మూడుసార్లు ఎంతో డీటైల్డ్‌గా చెప్పారు. నీకు స్టోరీ నచ్చితేనే ఈ సినిమా చేద్దాం లేకపోతే వేరే స్టోరీతో వెళ్దాం అని నాకు ఎంతో ఫ్రీడమ్‌ ఇచ్చేవారు. నన్ను హీరోగా చెయ్యడం కోసం మా పేరెంట్స్‌ ఎంతగా నన్ను ఎంకరేజ్‌ చేసారో.. పూరిగారు కూడా తన కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్‌ చేస్తే ఎంత కేర్‌ తీసుకుంటారో అంత కేర్‌ తీసుకున్నారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను.

నేను పూరిగారికి పెద్ద ఫ్యాన్‌ని. అలాంటిది ఆయన డైరెక్షన్‌లో నన్ను హీరోగా ఇంట్రడ్యూస్‌ చేస్తున్నందుకు ఎంతో రుణపడి వుంటాను. పూరిగారి సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్‌ నాకు చాలా ఇష్టం. ఇడియట్‌, పోకిరి, లోఫర్‌.. ఇలా అన్ని సినిమాల్లోనూ హీరోగా చాలా డిఫరెంట్‌గా వుంటాడు. ‘రోగ్‌’లో కూడా నా క్యారెక్టర్‌ చాలా డిఫరెంట్‌గా వుంటుంది. ఖచ్చితంగా నా క్యారెక్టరైజేషన్‌ ఆడియన్స్‌కి నచ్చుతుంది. నాకు నా క్యారెక్టర్‌ ఎంత బాగా నచ్చిందో, విలన్‌ క్యారెక్టర్‌ కూడా అంతే నచ్చింది.’ 

Have something to add? Share it in the comments

Your email address will not be published.