కొనసాగుతున్న శర్వా హవా

ఈ ఏడాది టాలీవుడ్ అందుకున్న విజయాల్లో యువ హీరో శర్వానంద్ నటించిన ‘శతమానంభవతి’ కూడా ఒకటి. ఈ సినిమాతో హీరోగా శర్వానంద్ స్థాయి పెరిగిందనే చెప్పాలి. అందుకే మంచి మంచి ఆఫర్లు ఆయన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే ఆయన నూతన దర్శకుడు చంద్రమోహన్ దర్శకత్వంలో నటిస్తున్న ‘రాధ’ మార్చి లోనే విడుదల కానుండగా మరో భారీ ఆఫర్ ఒకటి ఆయన చేతుల్లో వాలినట్టు తెలుస్తోంది.

లవబుల్ హీరో శర్వానంద్ ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. చేసిన ప్రతి సినిమాలో కాస్త వైవిధ్యం చూపిస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తున్నాడు. ఇప్పుడు ఈ హీరో దర్శక దిగ్గజం కె. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడితో కలిసి మరో సినిమా చేయబోతున్నాడు. ప్రకాశ్‌ కి ఇప్పటివరకూ కాలం కలిసిరాలేదు. అటు యాక్టర్ గాను.. ఇటు దర్శకుడిగాను చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. అనగనగా ఓ ధీరుడు.. సైజ్ జీరో లాంటి సినిమాలు ఫ్లాప్ అవడంతో బాగా గ్యాప్ తీసుకున్నాడు ప్రకాష్.

ప్రకాష్ చెప్పిన స్క్రిప్ట్ శర్వాకి విపరీతంగా నచ్చేయడంతో.. అతనితో సినిమాకి సై అనేశాడు శర్వానంద్ . ప్రస్తుతం రాధా అనే మూవీని రెడీ చేస్తున్న శర్వా.. సమ్మర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నాడు. మార్చి 29న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకంటున్నాడు. తాజాగా సంక్రాంతికి విడుదలైన శతమానం భవతి సాధించిన విజయం.. ఈ హీరో రేంజ్ ని మార్చేసిందని చెప్పాలి. ఇప్పుడు మీడియం రేంజ్ లో ప్రామిసింగ్ హీరో అయిన శర్వా.. ప్రకాష్ కోవెలమూడికి సపోర్ట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడని చెప్పాలి.
శతమానం భవతి విషయంలో కూడా దర్శకుడు సతీష్ వేగేశ్న ట్రాక్ రికార్డ్ ని పట్టించుకోలేదు శర్వా. ఇప్పుడు ప్రకాష్ విషయంలో కూడా ఇదే రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఇక్కడ మరో విశేషమిటంటే ఈ ప్రాజెక్టును ‘బాహుబలి’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా నిర్మించనుంది. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మొత్తం మీద బాహుబలి నిర్మాతలతో సినిమా చేయడం శర్వానంద్ కి , ప్రకాశ్‌ కెరీర్ కు బాగా కలిసొచ్చే అంశమనే చెప్పుకోవాలి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.