దున్నపోతు ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకే జగన్ దీక్ష: కొడాలి నాని

YS Jagan completes two days Rythu Deeksha Demanding Justice For Farmers

YS Jagan completes two days Rythu Deeksha Demanding Justice For Farmers

గుంటూరులో రెండు రోజులపాటు దీక్ష చేసిన వైఎస్‌ జగన్ దీక్షా వేదిక రైతులు పడుతున్న ఇబ్బందులను హైలెట్ చేయడం మానేసి చంద్రబాబు, లోకేశ్‌లను దుయ్యబట్టడానికే వాడుకున్నారు నాయకులు. రైతు దీక్ష చేస్తే ప్రభుత్వానికి కదలిక వచ్చి గతంలో టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 5వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని డిమాండ్‌ చేశారు.

దొంగ వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన దొంగ ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతులకు న్యాయం చేస్తారని దున్నపోతు ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకే వైఎస్‌ జగన్‌ రెండురోజుల పాటు దీక్ష చేశారని స్పష్టంచేశారు. రాష్ట్రంలో పంటకు గిట్టుబాటు ధరలేక ప్రభుత్వం చేతిలో దారుణమైన మోసానికి గురవుతున్నవారికి అండగా ఉండేందుకే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతు దీక్ష చేపడ్తే చంద్రబాబు తన మంత్రులు, చెంచాలు, పకోడి గాళ్లను పెట్టించి తిట్టించే కార్యక్రమం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి…తెలంగాణ సీఎం కేసీఆర్‌కు భయపడి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని కొడాలినాని ఘాటుగా విమర్శించారు. అంతేగాక టీడీపీని నందమూరి కుటుంబానికి ఇచ్చేసి, చంద్రబాబు నాయుడు సొంతంగా పార్టీ పెడితే డిపాజిట్లు కూడా రావని ఎమ్మెల్యే కొడాలి నాని ఎద్దేవా చేశారు. జయంతికి, వర్థంతికి తేడా తెలియని వ్యక్తిని తీసుకు వచ్చి మంత్రిని చేశారని, ఆ మంత్రి నీటి సమస్యను పరిష్క్రరించడం కాదు, సృష్టిస్తారని చెప్పడం బాధాకరమన్నారు కొడాలి నాని.

ఇప్పటికైనా ప్రభుత్వానికి సిగ్గు,శరం ఉంటే ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయాలని కొడాలి నాని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై అవాకులు, చవాకులు పేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కొడాలి నాని  సీరియస్‌గా హెచ్చరించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.