ఒక్క అంగుళం భూమి కూడా పోనివ్వం

YS Jagan gets emotional in Save Vishakapatnam Maha Dharna
విశాఖపట్నంలో చోటుచేసుకున్న పెద్ద మొత్తం భూకుంభకోణంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సేవ్‌ విశాఖ’ మహాధర్నా సక్సెస్ అయ్యింది. ప్రతిపక్షపార్టీ తలపెట్టిన ఈ కార్యక్రమానికి జనాలు భారీ స్థాయలో హాజరయ్యారు. ప్రజలను ఉద్దేశించి ప్రతిపక్షనేత జగన్‌ ఉత్తేజభరితంగా మాట్లాడారు. ముదపాకలో ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో భారీగా అసైన్డ్‌ భూములను కొట్టేసే ప్లాన్‌ చేశారని అన్యాయాన్ని ఎత్తిచూపేందుకే మహాధర్నా చేస్తున్నామని జగన్ స్పష్టంచేశారు.
YS Jagan gets emotional in Save Vishakapatnam Maha Dharna
ముదపాకలో ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా అసైన్డ్ భూములను కొట్టేసేందుకు పన్నాగాలు రచించారని, అందులో భాగంగానే లక్ష ఆరు వేల ఎకరాల సర్వే నెంబర్లు కనిపించడం లేదని కలెక్టర్‌ కొత్త కథ చెబుతున్నారని, హుదుద్‌లో రికార్డులు పోయాయని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల తర్వాత ఈ విషయం గుర్తొచ్చిందా అని నిలదీశారు. హుదుద్‌లో కలెక్టర్‌ భవనాలు ఎగిరిపోలేదని, సునామీలాగా నీరు రాలేదని, తాను 11 రోజులు ఇక్కడే ఉండి అన్ని ప్రాంతాలు తిరిగినట్లు గుర్తు చేశారు.
రెవెన్యూ రికార్డులు ఎలా అంటే మార్చుకునేందుకే ఈ కట్టుకథలన్నీ కలెక్టర్‌ చెబుతున్నారని, దాదాపు 23 వేల ఎకరాలు కబ్జా అయ్యాయని ప్రభుత్వ లెక్కలే చెబుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఒక్క అంగుళం భూమిని కూడా పోనివ్వమని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఈ ధర్నాతోనైనా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బుద్ధి రావాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్లు రెవెన్యూ అధికారులు కలిసి మాఫియాగా మారారని ధ్వజమెత్తారు. భూములను విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్.

See Also: శిరీష మృతి కేసులో బలపడుతున్న అనుమానాలు

మంత్రి అయ్యన్నపాత్రుడు విశాఖలో భూదందా జరుగుతోందని ముందునుంచే చెప్పారని, జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరరావు దగ్గరుండి భూములన్నింటినీ కబ్జా చేయించారని, ఆయన బంధువు భాస్కరరావు తనకు సంబంధం లేని భూములను తన పేరిట రిజిస్టర్‌ చేసుకొని పేదల కాలనీలో భూములను బ్యాంకుల్లో కుదవపెట్టి లోన్లు తీసుకున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమానికి స్వయంగా ప్రభుత్వాధికారులే సహకరిస్తున్నారని ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. గంటాకు ఇంత నారా లోకేశ్‌కు ఇంత అని డబ్బులు పంచుకుంటున్నారని ధ్వజమెత్తారు.

See Also: నేనిష్టంలేకపోతే నేను మీకెందుకు పనిచెయ్యాలి???

కలెక్టరే స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో కుమ్మక్కై లోకేశ్‌తో చేతులు కలిపి అందరు కలసి భూదందాలు చేస్తుంటే సామాన్యుడు ఎక్కడికి వెళ్లాలని మండిపడ్డారు. దస్‌పల్లా భూములు వివాదంలో ఉన్నాయని, అందులో టీడీపీ ఆఫీసు కట్టిస్తున్నారంటే వాటిని కబ్జా చేశారా? చంద్రబాబు నాయుడు అని నిలదీశారు. విశాఖ మీద ప్రేమ ఉందని చెప్పి ఇక్కడ ఉన్న ఎయిర్‌పోర్ట్‌ తొలగించి భోగాపురంలో కొత్త ఎయిర్‌పోర్ట్‌ తెస్తారని చంద్రబాబు చెబుతున్నారని, కానీ, ఆ ఎయిర్‌పోర్ట్‌ వచ్చేది మాత్రం టీడీపీ నేతల భూములు ఉన్నచోటేనని చెప్పారు.
YS Jagan gets emotional in Save Vishakapatnam Maha Dharna
మొదట బహిరంగ విచారణ అన్నారు.. వేలమంది వస్తారేమోనని భయపడి.. సిట్‌ తో చేస్తారంట. సిట్‌లో ఉన్న అధికారులంతా చంద్రబాబు కింద పనిచేసేవారు. చేసింది నువ్వు.. నీ కొడుకు.. నీమంత్రులు, నీ రెవెన్యూ అధికారులు అయినప్పుడు సిట్‌ రిపోర్టు ఏమొస్తుంది. సీతమ్మ వారిని ఎత్తుకొని పోవడం సరేనా అని రావణుడు కుంభకర్ణుడితో దర్యాప్తు చేయిస్తే ఏం లాభం హనుమంతుడితో వేయిస్తే గానీ తన్ని లోపల వేస్తాడు. అలాగే, సీబీఐ దర్యాప్తు వేస్తే చంద్రబాబును, లోకేష్‌ను, మంత్రులు, అధికారులను తన్ని లోపల వేస్తారు’ అని వైఎస్‌ జగన్‌ చురకలు అంటించారు.
మొత్తానికి సేవ్ విశాఖపట్టణం మహాధర్నా కార్యక్రమం వైఎస్‌జగన్‌తోపాటు పార్టీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.

See Also: బయటికొస్తున్న కొత్త కోణాలు

Have something to add? Share it in the comments

Your email address will not be published.