అవినీతి చక్రవర్తి: 56కుంభకోణాలు, 3లక్షల కోట్ల అవినీతి

YS Jagan released updated version of Emperor of corruption book on Chandrababu

వైఎస్సాఆర్సీపీ ప్లీనరీ హాట్ హాట్‌గా జరుగుతోంది. వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ప్రాంగణంలో జరుగనున్న మూడవ జాతీయ ప్లీనరీ సమావేశాల్లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ నిర్మాణం పటిష్టత, 2019 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల సంక్షేమం కోసం తీసుకునే చర్యలు వంటి పలు కీలక అంశాలపై చర్చలు సాగనున్నాయి.  ప్లీనరీలో మొదటిరోజు అయిన ఈరోజు ఉదయం ఎంపరర్‌ ఆఫ్ కరప్షన్‌ (అవినీతి చక్రవర్తి) అనే పుస్తకాన్ని ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు.

YS Jagan released updated version of Emperor of corruption book on Chandrababu

చంద్రబాబు మూడేళ్ల పరిపాలనలో ఎన్ని అవినీతి, అక్రమ కార్యక్రమాలకు పాల్పడడ్డారో ఈ పుస్తకం ద్వారా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజలు తెలియజేయనుంది. ఈ పుస్తకంలో చంద్రబాబు నాయుడు ఈ మూడు సంవత్సరాల్లో చేసిన అవినీతి మీద పుస్తకం ఆధారాలతో అన్ని ముద్రించారు.అంతేగాక ప్లీనరీకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ పుస్తకాన్ని అందిచాలని నిర్ణయించుకున్నారు. 2019 ఎన్నికలకు సంబంధించి ఇప్పటినుండే పోరాటాన్ని మొదలుపెట్టిన వైసీపీ, గ్రామస్థాయిలో పార్టీ కార్యాచరణను అమలుపరిచేలా చర్యలు మొదలుపెట్టింది.

See Also: జగన్‌కు మొట్టికాయలు

అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ళలో 3లక్షల 75వేల కోట్ల రూపాయల విలువచేసే కుంభకోణాలు చంద్రబాబు ప్రభుత్వం చేసిందని, అందులో లక్ష కోట్ల కుంభకోణం రాజధాని ప్రాంత భూములపై అయితే మరో లక్ష కోట్లు విశాఖ భూ కుంభకోణం అని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ కుంభకోణాలే కాకుండా ఈ మూడు సంవత్సరాల్లో చంద్రబాబు వివిధ ప్రాజెక్టులపై కాంట్రాక్టుల దగ్గర తీసుకున్న లంచాల దగ్గర నుంచి ఇసుక, మద్యం కుంభకోణాలు, మట్టి నుంచి జెన్‌కో బొగ్గు కొనుగోళ్లు కుంభకోణాల వరకు అన్నింటి మీద సాక్షాధారాలతో ముద్రించామని వైసీపీ చెబుతోంది. అంతేగాక ప‌ట్టిసీమ‌పై కాగ్ ఇచ్చిన రిపోర్టును ఇందులో ప్ర‌స్తావించింది. కాగ్ డాక్యుమెంట్స్‌ను ఆధారాల‌తో స‌హా చూపించింది.

See Also: ఇవేం పనికిమాలిన హైసొసైటీ చదువులు

చంద్రబాబు ‘అవినీతి చక్రవర్తి’ పేరిట ఏడాది క్రితమే వైసీపీ ఓ పుస్తకాన్ని ప్రచురించింది.  అయితే ఈ ఏడాది కాలంలో చోటు చేసుకున్న మరిన్ని అవకతవకల్ని, కుంభకోణాల్ని కూడా చేర్చి తాజా పుస్తకాన్ని ముద్రించారు.  రెండు రోజుల పాటు నిర్వ‌హించే ప్లీన‌రీ స‌మావేశాల‌కు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఇత‌ర రాష్ట్రాలు, దేశాల నుంచి ప్ర‌తినిధులు దాదాపు 30 వేల‌కు పైగా హాజ‌రు అవుతున్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.