చంద్రబాబు ఇప్పుడు రాజకీయ వ్యభిచారులు ఎవరు ??: జగన్

YSRCP Chief jaganmohan Reddy complains to Governer on Turncoats in AP cabinet undemocratic

YSRCP Chief jaganmohan Reddy complains to Governer on Turncoats in AP cabinet undemocratic

  • గవర్నర్‌తో భేటీ అయిన జగన్మోహన్‌రెడ్డి
  • పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రిపదవులు రాజ్యాంగ విరుద్ధం
  • తలసాని విషయంలో చంద్రబాబు ఏం మాట్లాడారు? ఇప్పుడెలా వ్యవహరిస్తున్నారు
  • గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన జగన్మోహన్‌రెడ్డి
  • ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి, ప్రధాని, ఈసీలను కలుస్తాం

ఆంధ్రప్రదేశ్‌ క్యాబినెట్ విస్తరణ పెద్ద రాజకీయ దుమారానికి తెరలేపింది. పార్టీ ఫిరాయింపులు చేసి టీడీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలకు మంత్రపదవులు ఇవ్వడాన్ని తప్పుబట్టిన ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డి గవర్నర్‌ను కలిసి చంద్రబాబునాయుడిపై ఫిర్యాదు చేశారు. వైసీపీ తరుపున గెలిచి మంత్రి పదవులు పొందిన వారి రాజీనామాలు ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని  గవర్నర్‌ను కోరినట్లు జగన్ తెలిపారు. గవర్నర్‌తో భేటీ తర్వాత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘గవర్నర్‌ను కలిసి మా ఫిర్యాదు లేఖను అందించాం.

ఒక పార్టీ గుర్తు మీద గెలిచి వాటికి రాజీనామా చేయకుండా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడం ప్రజాస్వామ్యమేనా అని గవర్నర్‌ను అడిగాం. తలసాని శ్రీనివాసయాదవ్‌కు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చినప్పుడు తెలంగాణలో ఇలాంటి పరిస్థితే ఎదురైనప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని విన్నవించాం. అంతేగాక చంద్రబాబు అప్పట్లో రాజీనామా ఆమోదించకుండా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తే రాజకీయ వ్యభిచారులుగా పోల్చిన ఘటనను ఇప్పుడున్న పరిస్థితులను ఏమనాలో అడిగాం. చంద్రబాబు ఆరోజు వ్యాఖ్యలకు ఈరోజు వ్యవహారం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉందని పోల్చారు జగన్. అందుకే ఆ మంత్రుల రాజీనామాలు ఆమోదింపబడేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరాం. ఒకవేళ అది కుదరకపోతే వాళ్ళపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశాం.

 పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేసేలా గట్టిగా పోరాటం చేస్తామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. ఇదే విషయంపై రాష్ట్రపతి, ఎన్నికల కమిషన్, ప్రధాని నరేంద్రమోడీ, వివిధ పార్టీల నాయకులను కలుస్తాం. ఈ నలుగురు చేత రాజీనామాలు చేసేలా ఒత్తిడి తెస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.