అవినీతి మంత్రులు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు: బొత్స

YSRCP leader Botsa fires on Chandrababu and Ministers in Nandyal by poll

నంద్యాల ఉపఎన్నిక జరుగుతుండడం ఏమో కానీ ఇన్నేళ్ళలో ఎన్నడూ రానంతమంది నాయకులు నంద్యాలపై ప్రేమ కురిపిస్తున్నారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ప్రజలకు సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎన్నడూ లేనిది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నంద్యాలకు వచ్చి ఇఫ్తార్ విందు ఇవ్వడంతోపాటు అనేక హామీలు సైతం చేసి వెళ్ళారు. అయితే స్థానికంగా బలంగా ఉన్న రెండు వర్గాల్లోనూ మా నాయకుడే గెలవాలన్న తపన ఎక్కువగా ఉండడంతో ఆయా పార్టీలకు చెందిన టాప్ నాయకులు అందరూ నంద్యాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

YSRCP leader Botsa fires on Chandrababu and Ministers in Nandyal by poll

నంద్యాల రణరంగంలో గెలిచేదెవరో, ఓడేదెవరో అనేది తర్వాత తేలే విషయమం అయినప్పటికీ ఇప్పటినుండే మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా వైఎస్సాఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నంద్యాలలో పర్యటించి అక్కడ చంద్రబాబుపై, ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.చెప్పిన మాటను చంద్రబాబు ఎప్పుడైనా నెరవేర్చారా? అంతేగాక మళ్లీ నంద్యాల ప్రజలను మోసం చేసేందుకు రెడీ అయ్యారని, ఇప్పటి వరకు కర్నూలు జిల్లాకు 33 వాగ్దానాలు చేశారని అందులో ఏ ఒక్కటైనా ఆచరణ సాధ్యమైందా? అని ప్రశ్నించారు.

అంతేగాక చిత్తశుద్ధిలేకనే చంద్రబాబు హామీలు నెరవేర్చడం లేదని, ఉప ఎన్నికలు రాష్ట్రంలో చాలా సందర్భాల్లో వచ్చాయని మరి రాష్ట్ర ప్రభుత్వం నంద్యాల ఉప ఎన్నికకు ఎందుకింత ప్రాధాన్యం ఇస్తున్నారు? ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా నంద్యాల ఉప ఎన్నిక అక్రమాలు,అరాచకాలతో గెలవాలని టీడీపీ అనుకుంటోంది.

See Also: సవాళ్ళు- ప్రతి సవాళ్ళతో హీటెక్కుతున్న నంద్యాల

కర్నూలును ఇదీ చేస్తాం అదీ చేస్తామని హామీలిస్తున్నారని, అయితే ఒకసారి ఓటేసిన పాపానికి మొత్తం నాదే అంటే కుదరదఃని హెచ్చరించారు.పోలీసులతో బలహీనవర్గాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, జిల్లా మంత్రి  సైతం పోలీసుల చర్యకు వత్తాసు పలికారని మండిపడ్డారు బొత్స. అంతేగాక పదేళ్లు తాను మంత్రిగా చేశాను, ఎప్పుడైనా ఇలా జరిగిందా? అంటూ ప్రశ్నించారు. టీడీపీ తాటాకు చప్పుళ్లకు నంద్యాల ప్రజలు భయపడరని, ఈ ప్రభుత్వంలో మంత్రులే తీవ్రస్థాయిలో అవినీతికి పాల్పడ్డారని, అలాంటి మంత్రులు ఏ ముఖం పెట్టుకుని వచ్చి నంద్యాలలో ఓట్లు అడుగుతారని విమర్శించారు.

See Also: నేనిష్టంలేకపోతే నేను మీకెందుకు పనిచెయ్యాలి???

ప్రజల ఆవేదన, కన్నీళ్లు కన్పించడం లేదా? అని,  ప్రభుత్వ పెద్దలు మేం తప్ప అందరూ అమాయకులని అనుకుంటున్నారని అన్నారు. అంతేగాక డబ్బులిచ్చి ఓట్లు కొనేయాలని చంద్రబాబు అనుకుంటున్నారని, దోచుకున్న డబ్బుతో ఓటుకు ఐదు వేలు ఇవ్వగలనని చెబుతున్నారని , చంద్రబాబు కంటికి ప్రజలంతా భిక్షగాళ్లలా కన్పిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బొత్స సత్యనారాయణ.

See Also: అసలైన ఆట మొదలైంది

Have something to add? Share it in the comments

Your email address will not be published.