అమిత్ షా కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళారా?? : చంద్రబాబుకి రోజా సూటిప్రశ్న

YSRCP MLA Roja fires on AP CM Chandrababu and his Foreign Tours

YSRCP MLA Roja fires on AP CM Chandrababu and his Foreign Tours

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన చంద్రబాబు ఢిల్లీలో 6గంటలు ఎవరికీ కనిపించకుండా ఎక్కడికి వెళ్ళారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేగాక వైఎస్‌ జగన్‌ మగాడిలా మీడియా సమక్షంలో  ప్రధాని మోదీని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ గురించి, ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించారని తెలిపారు రోజా.

అదే సమయంలో ఆ 6 గంటల్లో  చంద్రబాబు అమిత్‌ షా కాళ్లు పట్టుకోవడానికా లేక హోంమంత్రి కాళ్లు పట్టుకోవడానికి వెళ్లారా? అని సూటిగా ప్రశ్నించారు. స్నానం చేయకుండా 24 గంటలపాటు రాష్ట్ర ప్రజల కోసమే విదేశీ పర్యటనలు చేస్తున్నానని చంద్రబాబు అన్న మాటలకు జనం నవ్వుకుంటున్నారని బాబు ఎందుకు విదేశీ పర్యటనలు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదని విమర్శించారు.

దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి, విరాళాల కోసమే చంద్రబాబు విదేశీ పర్యనటలు చేస్తున్నారనే ప్రజలు భావిస్తున్నారని అన్న రోజా అమెరికాలో 300 కంపెనీల సీఈవోలను కలుస్తానని వెళ్ళిన చంద్రబాబు అవినీతి తెలుసుకొని సుమారు 200మంది సీఈఓలు కలవడానికి భయపడ్డారని దుయ్యబట్టారు రోజా. అంతేగాక ఆ ఆరుగంటల డ్రామాను పక్కదారి పట్టించడానికే  ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి సస్పెన్షన్‌ డ్రామా తెరపైకి తీసుకొచ్చారని, సుజనా చౌదరి మారిషస్‌ బ్యాంకు వందల కోట్లు ఎగ్గొట్టారని, అలాంటివారికి కేంద్రమంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు.

తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదనడం అవివేకమన్న రోజా  చంద్రబాబు శ్రీవారి దర్శనానికి వచ్చి అనేక హామీలు ఇచ్చారని నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆలయాల చుట్టూ ఉన్న బెల్ట్‌ షాపులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.