‘రాక్షస పాలన’ కనిపించిందంటున్న జగన్

 

అసెంబ్లీ గేట్ 4 వద్ద మీడియా తో జగన్….

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో ఈరోజు రాక్షసపాలన కనిపించిందంటున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి. అగ్రిగోల్డ్ పై చర్చ జరుగుతున్నప్పుడు దాదాపుగా 20 లక్షల కుటుంబాలు న్యాయం కోసం ఎదురు చూశాయని, చంద్రబాబు ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు సభలో అగ్రిగోల్డ్ గురించి అస్సలు మాట్లాడలేదని దుయ్యబట్టారు. అగ్రిగోల్డ్‌ అంశంపై చర్చను పక్కదోవ పట్టించేందుకే స్పీకర్‌ వ్యాఖ్యల అంశాన్ని తెరపైకి తెచ్చారని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

20 లక్షల కుటుంబాలను రోడ్డున పడేసిన అగ్రిగోల్డ్‌ అంశంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి పేరు ప్రస్తావనకు రావడంతోనే ఉద్దేశపూరితంగా అసెంబ్లీలో చర్చను అటకెక్కించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు నెల రోజుల కిందట జరిగిన మహిళా పార్లమెంటు సదస్సు సందర్భంగా ప్రెస్‌మీట్‌లో స్పీకర్‌ చేసిన వ్యాఖ్యల అంశాన్ని కావాలనే తెరపైకి తెచ్చారని విమర్శించారు.

మహిళల అత్యాచారాలపై స్పందిస్తూ స్పీకర్‌ చేసిన వ్యాఖ్యలను ఒక్క ‘సాక్షి’ మీడియానే కాకుండా రాష్ట్రంలోని అన్ని చానెళ్లు, జాతీయ మీడియా సైతం ప్రచురించాయని, అలాంటప్పుడు ఒక్క ‘సాక్షి’ మాత్రమే ఆయన వ్యాఖ్యలను ప్రచురించినట్టు ప్రభుత్వం హంగామా చేస్తున్నదని దుయ్యబట్టారు. ఇంటియా టుడే, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, డెక్కన్‌ క్రానికల్‌ వంటి ఆంగ్ల మీడియాలో సైతం ఏపీ స్పీకర్‌ మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవి అంటూ కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు డైరెక్షన్‌కు కాలువ శ్రీనివాసులు యాక్షన్‌, స్పీకర్‌ రియాక్షన్‌..ఇలా అన్ని కలిసొచ్చి అగ్రిగోల్డ్‌ అంశం అటకెక్కిందని తప్పుబట్టారు.

ప్రజాస్వామ్యం బతకాలంటే.. అందరూ ఒకతాటి మీదకి రావాలన్నారు. న్యూస్ ఛానల్స్, పేపర్ నచ్చకపోతే ఇష్టమొచ్చినట్లు తీర్మానాలు చేసేసి, చర్యలు తీసుకునే అవకాశాలు కల్పిస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుందన్నారు. ఇదే న్యూస్ ఛానల్స్ లో చంద్రబాబు అన్న మాటల్ని ప్లే చేయలేదు. ఇదే చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎమ్మెల్సీలను గెలిపించేందుకు సూట్ కేసుల్లో నల్లధనం తీసుకువెళ్లి.. ఆడియో, వీడియోటేపుల్లో అడ్డంగా దొరికిపోయారన్నారు. సుప్రీంకోర్టు వాజ్యాన్ని విని నోటీసులు ఇచ్చిన పరిస్థితిలో ఆ టేపులు ప్లే చేయాలని చంద్రబాబుకు, స్పీకర్ కు అనిపించలేదన్నారు. సభకు సంబంధంలేని స్పీకర్ వ్యాఖ్యల్ని అన్ని ఛానల్స్ తో పాటు సాక్షి కవర్ చేస్తే.. దాని మీద యాక్షన్ తీసేందుకు ప్రదర్శిస్తున్నారు.

అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ ఎలా కొనుగోలు చేసింది ?

అగ్రిగోల్డ్ బాధితులు ఇచ్చిన డేటాను అసెంబ్లీలో చూపించాం. ఛైర్మన్ కు సంబంధించి ఒక తమ్ముడ్ని అరెస్ట్ చేశారు. మిగిలిన 8 మంది తమ్ముళ్లు బయట ఉండి.. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్ముతున్నారు. బినామీలుగా వ్యవహరిస్తున్నారు. ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ అగ్రిగోల్డ్ ఆస్తులు ఎలా కొనుగోలు చేసింది.. వివరించారు. ఉదయ్ దినకర్ జీపీఏ తీసుకొని ప్రత్తిపాటి పుల్లారావుకు మంత్రి అయ్యాక భూములు అమ్మాడు. పుల్లారావు కొన్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో సహా చూపించటం జరిగిందన్నారు. ఈ ఉదయ్ దినకర్ హాయ్ ల్యాండ్ డైరెక్టర్ గా ఉన్నారు. బంధువు అన్న సంగతి స్పష్టమౌతోంది.

అయినా ప్రత్తిపాటి పుల్లారావు సమర్థించుకుంటున్నారని శ్రీ జగన్ ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ గ్రూప్ వెంకట్రాది హోటల్స్ ను 14 కోట్లకు అమ్మేశారు. ఇవన్నీ అటాచ్ మెంట్ పరిధిలోకి రాలేదు. వాటని అన్నింటినీ అటాచ్ మెంట్ పరిధిలోకి తీసుకురండని మరోసారి జగన్ డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ సీతారం మెంబర్, డైరెక్టర్. ఆయన భార్య పుష్పలత, ఆయన కూతురు హిమజ బంధువులు బ్రహ్మం గారి మఠంలో భూములు అమ్ముతున్న విషయాన్ని సభ ద‌ృష్టికి తీసుకు వచ్చామన్నారు. 1182 కోట్లు ఇస్తే.. అగ్రిగోల్డ్ భూములు ఇచ్చేస్తే 14 లక్షల మందికి ఉపశమనం కలుగుతుందని కోరటం జరిగిందన్నారు.

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.